ASSEMBLY ELECTIONS 2022 RESULT SC CJI BENCH TO HEAR PIL SEEKING VVPAT VERIFICATION BEFORE COUNTING OF EVM VOTES MKS
Election Results 2022: కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు.. ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
యూపీతోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో పార్టీల భవితవ్యం మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ(మంగళవారం) కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Elections 2022 Result) గురువారం(మార్చి 10న) వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ మొదలవుతుంది. యూపీతోపాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో పార్టీల భవితవ్యం మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. అయితే ఓట్ల లెక్కింపునకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ(మంగళవారం) కీలక వ్యాఖ్యలు చేసింది.
కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముందుగా వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని, ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించాలని, చివరికి రెండిటినీ పోల్చుకున్న తర్వాతే తుది ఫలితాన్ని ప్రకటించేలా ఎన్నికల కమిషన్ కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కానీ అత్యవసర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది మీనాక్షి అరోరా మాట్లాడుతూ.. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ట్యాలీ కోసం వీవీ ప్యాట్ స్లిప్పుల వెరిఫికేషన్ చేస్తున్నారని, ఆ సమయంలో ఎలక్షన్ ఏజెంట్లు కూడా వెళ్లిపోతున్నారు కనుక సదరు తనిఖీలో పారదర్శకత కొరవడిదని, కాబట్టి ఏజెంట్లందరూ ఉండగా, ముందుగానే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించే విధానాన్ని అమలు చేయాలని, ఆమేరకు కోర్టు ఈసీకి ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై సీజేఐ రమణ స్పందిస్తూ..
ఓట్ల లెక్కింపులో వీవీప్యాట్ స్లిప్పుల పరిశీలన ముందు జరగాలనే పిటిషన్ సీజేఐ బెంచ్ ముందుకురాగా, జస్టిస్ రమణ మాట్లాడుతూ.. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనుండగా చివరి నిమిషంలో ఇలా కోరితే మేము ఎలా సాయపడగలము? ఒక రోజు తర్వాతే కౌంటింగ్ ఉంది. ఈ అంశంపై రేపు (బుధవారం) విచారణ చేపట్టినా.. అన్ని రాష్ట్రాలకు మీరు కోరినట్టు ఆదేశాలు జారీ చేయడం సాధ్యపడుతుందా? సరే చూద్దాం, ఏం చేయగలమో చేస్తాం’అని పేర్కొన్నారు. బీజేపీ కూటమి, ఆర్జేడీ కూటమి పోటాపోటీగా తలపడిన బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఈ తరహా ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.