ASSEMBLY ELECTIONS 2022 CIRCUMSTANCES CHANGED IN FIVE YEARS AAP IS BECOMING ACTIVE IN PUNJAB POLITICS EVK
Assembly Elections 2022: అప్పుడు లెక్కలేని పార్టీ.. ఇప్పుడు లెక్కలు మారుస్తోంది.. రసవత్తరంగా పంజాబ్ రాజకీయం!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు
Assembly Elections 2022 | 2017లో అధికారంలోకి వస్తుందని అందరూ భావించినా.. ఆప్ చతికిల పడింది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆప్ లెక్కలు మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శిరోమణి అకాళిదళ్ దెబ్బతినడం కాంగ్రెస్ వ్యతిరేకత, బీజేపీకి పుంజుకోకపోవడంతో ఈ సారి ఆప్ పంజాబ్ లెక్కలు మార్చేలా ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఓ సంచలనాల పార్టీగా పేరుపొందింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన ఆప్.. తరువతా బీజేపీతో తీవ్రమైన పోటీ ఎదర్కొంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయినా.. ఢిల్లీ (Delhi) అసెంబ్లీలో మంచి ఫలితాలను సాధించింది. అయితే ఆప్ ఆవిర్భావం తరువాత పంజాబ్ (Punjab) పీఠంపై కన్ను వేసింది. అయితే 2017లో చరిత్ర సృష్టిస్తుంది అని భావించినా అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల్లో నామమాత్రంగా మిగిలిపోయింది. తరువాత పార్టీ నిర్మాణంపై దృష్టిసారించింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే దానిపై ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాలు ముడిపడి ఉన్నాయి.
2017లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం పంజాబ్‌పై లేదు. ప్రజలు శిరోమణి అకాలీదళ్‌ను వెనక్కు నెట్టినా అధికారానిక దూరంగా మిగిలిపోయింది. ఐదేళ్లలో పంజాబ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. శిరోమణి అకాళీదళ్ పూర్తిగా సంస్థగతంగా పార్టీ నిర్మాణాన్ని కోల్పోయింది. బీజేపీతో పొత్తు ముగిసిన తరువాత. పార్టీ ఎవరితో పోరాడుతుందో అర్థం కాకుండా అయింది. రైతు చట్టాలను వ్యతిరేకించి ఇటు రైతులకు దగ్గర కాలేదు. దానితోపాటు బీజేపీకి దూరం అయింది.
ఇటు ఆప్ పరిస్థితి భిన్నంగా మారింది. ఐదేశ్ల క్రితం 20 ఎమ్మెల్యేలతో పంజాబ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆప్‌ను కాంగ్రెస్ వదలేదు. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు సగం మంది కాంగ్రెస్ వైపు వెళ్లారు. అయినా క్షేత్రస్థాయిలో పార్టీపై ఓటర్లకు నమ్మకం కలిగించేలా ప్రయత్నించింది.
ఆప్‌కు కలిసివచ్చే అంశాలు..
సంస్థగతంగా శిరోమణి అకాళిదల్ బాగా దెబ్బతింది. ఇటు ప్రజలకు దగ్గర కాలేకపోయింది. అటు కేంద్రంలో బీజేపీ (BJP) దూరం అయింది. ఈసారి ఎన్నికల్లో అకాళిదళ్ ప్రభావం ఎక్కువగా ఉండకపోవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైతు ఉద్యమం క్రెడిట్ ఎక్కువగా కాంగ్రెస్ (Congress) పొందింది. అటు బీజీపీ ఎన్నికల్లో అంచనాలో అస్సలు లేదు. ఒక వేళ కెప్టెన్ అమరెందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకొంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. కానీ అధికారం అందుకుంటుందని చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్‌కు మాత్రం కెప్టెన్ అమరేందర్ సింగ్ బయటకు వెళ్లడం నష్టం. ఈ వ్యతిరేకత ఎక్కువగా ఆప్‌కు కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పంజాబ్ 2017 ఫలితాలు..
పార్టీ
గెలిచిన సీట్లు
కాంగ్రెస్
77
బీజేపీ
03
శిరోమణి అకాళీదళ్
15
ఆప్
20
లోక్ ఇన్సాఫ్ పార్టీ
02
మొత్తం
117
2017 ఎన్నికల ఫలితాల తర్వాత దూరమైన క్యాడర్‌ను పునర్నిర్మించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం కూడా చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. 2017లో పార్టీ దాదాపు 100 సీట్లు గెలుస్తుందని చాలామంది అంచనా వేయగా, AAP కేవలం 20 మాత్రమే గెలుచుకోగలిగింది. మెజారిటీ సీట్లు (18) మాల్వా ప్రాంతం నుంచి .. రెండు దోబా నుంచి వచ్చాయి. మజా ప్రాంతంలో పార్టీ ఖాతా తెరవలేకపోయింది.
2019 లోక్‌సభ ఎన్నికలలో కొనసాగింది ఆప్ తన నాలుగు సీట్లలో ఒకదానిని మాత్రమే నిలుపుకుంది. దాని రాష్ట్ర అధ్యక్షుడు భగవంత్ మాన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
మున్సిపల్ కార్పొరేషన్లో ఆప్ మెరుగైన ఫలితాలు..
చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AAP ఆశ్చర్యకరమైన ప్రదర్శన, పార్టీ 14 వార్డులలో ముగియడంతో, BJP (12), కాంగ్రెస్ (8), అకాలీదళ్ (1) కంటే ఎక్కువ - పార్టీకి నైతిక బూస్టర్‌గా వచ్చింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.