మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు... కీలకమైన 10 పాయింట్లు

Assembly Elections Results 2019 : మరికొన్ని గంటల్లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఇందుకు సంబంధించి కీలక పాయింట్లు కొన్ని తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 24, 2019, 7:49 AM IST
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు... కీలకమైన 10 పాయింట్లు
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు... కీలకమైన 10 పాయింట్లు
  • Share this:
* మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 150 స్థానాల్లో, శివసేన 124 స్థానాల్లో పోటీ చేశాయి. మిగతా స్థానాల్లో చిన్న మిత్రపక్షాలు పోటీ చేశాయి. మెజార్టీ మార్కు 145. ప్రస్తుతం బీజేపీ, శివసేన కూటమికి అసెంబ్లీలో 217 స్థానాలున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కలిపి 56 సీట్లున్నాయి.

* మొత్తం 11 ఎగ్జిట్ పోల్స్... బీజేపీ, శివసేన కూటమికి 211 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఎన్సీపీకి 64 వస్తాయని అంచనా వేశాయి. గతంలో కంటే ఆ కూటమికి కాస్త ఎక్కువే వస్తాయని తెలిపాయి.

* హర్యానాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలుండగా... బీజేపీకి 66 వస్తాయనే అంచనా ఉంది. మొత్తం 7 ఎగ్జిట్ పోల్స్ ఇలాగే చెప్పాయి. కాంగ్రెస్‌కి 14 సీట్లు వస్తాయని తెలిపాయి. మెజార్టీ మార్కు 46. బీజేపీ గెలిస్తే, మనోహర్ లాల్ ఖట్టర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు.

* మొత్తం 17 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం కలిపి... 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే 2 లోక్ సభ స్థానాలకూ జరిగాయి. వీటిలో బీజేపీ దాని మిత్రపక్షాలూ 30 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌కి 12 దక్కవచ్చు. మిగతావి ప్రాంతీయపార్టీలు గెలుచుకునే అవకాశాలున్నాయి.



* ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు బైపోల్స్ జరిగాయి. అలాగే గుజరాత్‌లో ఆరు, బీహార్‌లో 5, అస్సాంలో 4, పంజాబ్‌లో 4, కేరళలో 5, సిక్కింలో 3, రాజస్థాన్ 2, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడు 2, అరుణాచల్ ప్రదేశ్ 1, మధ్యప్రదేశ్ 1, తెలంగాణ 1, ఒడిషా 1, చత్తీస్ గఢ్ 1, పుదుచ్చేరి 1, మేఘాలయ 1 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

* మహారాష్ట్రలో బీజేపీ మరోసారి శివసేనతో జట్టుకట్టింది. గత ఐదేళ్లలో ఆ రెండు పార్టీల మధ్య చాలాసార్లు విబేధాలు వచ్చాయి. 2014లో రెండు పార్టీలూ వేర్వేరుగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత తిరిగి కలిసి అధికారంలోకి వచ్చాయి.

* ఈసారి శివసేన 50-50 సీట్ల సర్దుబాటు ఉండాలని కోరినా... చివరకు ఆ పార్టీ తక్కువ సీట్లలోనే పోటీ చేయాల్సి వచ్చింది. ఐతే... ఉప ముఖ్యమంత్రి పదవిని శివసేనకు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ గెలిస్తే, దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.
Loading...
* శివసేన నుంచీ ఉప ముఖ్యమంత్రిగా ఆదిత్య థాక్రే నిలిచే అవకాశాలున్నాయి. ఆయన తాతగారు బాల్ థాక్రే పార్టీని స్థాపించిన తర్వాత... ఆ కుటుంబం నుంచీ ఎన్నికల్లో పాల్గొన్న మొదటి నేత ఆదిత్య థాక్రేనే.

* బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాల్నే ప్రస్తావించింది. పాకిస్థాన్, జమ్మూకాశ్మీర్, ఉగ్రవాదాన్ని ప్రస్తావించింది. కాంగ్రెస్ మాత్రం నిరుద్యోగం, రైతుల సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, ఆర్థిక వ్యవస్థలో మందగమనం వంటి వాటిని ప్రస్తావించింది.

* లోక్ సభ ఎన్నికల తర్వాత చతికిలపడిన కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకున్నట్లు కనిపించట్లేదు. అధ్యక్ష పదవి నుంచీ రాహుల్ తప్పుకోవడంతో సోనియా గాంధీ మళ్లీ ఆ బాధ్యతలు స్వీకరించినా, ఇదివరకంత చురుగ్గా నిర్వహించలేకపోతున్నారు. అనారోగ్యం ఆమెను వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో సోనియా ప్రచారం చెయ్యలేకపోయారు.

* బీజేపీ మాత్రం జోరుగా ప్రచారం చేసింది. ప్రధాని మోదీ 16 ర్యాలీలు చెయ్యగా, అమిత్ షా 25 చేశారు. రాహుల్ గాంధీ కేవలం 7 ర్యాలీలే చేశారు.
First published: October 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com