ఈశాన్య రాష్ట్రం త్రిపుర(Tripura)లో నేడు అసెంబ్లీ ఎన్నికల (Election)పోలింగ్ జరగుతోంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 60అసెంబ్లీ స్థానాల్లో జరుగుతున్న ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్(EC) పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1100 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు 31వేల మందిని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అలాగే 25వేల మంది సెక్యురిటీ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీకి కేటాయించినట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తమ సత్తా చాటుకుంటూ అధికారాన్ని దక్కించుకుంటున్న బీజేపీ(BJP)కి త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాల్‌గా మారాయి. ఇక్కడ బీజేపీ ఐపీఎఫ్‌టీ(IPFT)తో పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్(Congress)వామపక్షాల కూటమి ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే విజయం ఎవర్ని వరిస్తుందనే విషయంపై మాత్రం అంత ఈజీగా చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పకడ్బందీ ఏర్పాట్లు ..
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 60శాసనసభ స్థానాల్లో జరుగుతున్న పోలింగ్ కోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈసారి ఎన్నికల్లో 259మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. ఇందులో 20మంది మహిళా అభ్యర్ధులున్నారు. రాష్ట్రంలో మొత్తం 28.13లక్షల ఓటర్లు ఉండగా అందులో మహిళ ఒటర్ల సంఖ్య 13.53గా ఉంది.
#TripuraElections2023: Long queue outside polling booths even before the voting has begun.#PollsWithAIR #ECI@ceotripura @ECISVEEP @SpokespersonECI @PIBAgartala #AIRPics: Manas Pratim Sarma pic.twitter.com/s8AaE3n3OT
— All India Radio News (@airnewsalerts) February 16, 2023
పోటా పోటీ ..
గెలుపుపై గురి పెట్టుకున్న బీజేపీకి ఇక్కడ విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 60స్థానాల్లో బీజేపీ 55సీట్లలో పోటీ చేస్తుండగా ఐపీఎఫ్‌టీ ఐదు చోట్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక వామపక్ష కూటమిలో సీపీఎం 47సీట్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ కేవలం 13 స్థానాల్లో తమ అభ్యర్ధుల్ని నిలబెట్టింది. ఈసారి పోటీలో రాజవంశానికి చెందిన తిప్ర మోత అధికార, విపక్షాలకు కంట్లో నలుసుగా మారారు. 42మందిని పోటీకి దింపారు. తృణమూల్ కాంగ్రెస్ 28, ఇండిపెండెంట్ అభ్యర్ధులు 42మంది పోటీ చేస్తున్నారు. మార్చి 2 త్రిపుర అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Tripura