Home /News /national /

ASSEMBLY ELECTION 2022 WIN FOR US NEVER INCREASE PETROL PRICES FOR THREE YEARS BJP ELECTION PROMISE EVK

Assembly Election 2022: మ‌మ్మ‌ళ్ని గెలిపించండి.. మూడేళ్లు పెట్రోల్ ధ‌ర‌లు పెంచం!

గోవా అసెంబ్లీ (ఫోటో క్రెడిట్ - ట్విట్ట‌ర్‌)

గోవా అసెంబ్లీ (ఫోటో క్రెడిట్ - ట్విట్ట‌ర్‌)

Assembly Election 2022 | త్వ‌ర‌లో గోవా (Goa) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు హామీల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అటు బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్ ప్ర‌చారంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాల‌తోపాటు ప్ర‌జ‌ల‌పై హామీల జ‌ల్లు కురిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    త్వ‌ర‌లో గోవా (Goa) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు హామీల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అటు బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్ ప్ర‌చారంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాల‌తోపాటు ప్ర‌జ‌ల‌పై హామీల జ‌ల్లు కురిపిస్తున్నాయి. తాజాగా వచ్చే మూడేళ్లపాటు పెట్రోల్‌ (Petrol) , డీజిల్‌పై రాష్ట్ర సుంకాలను పెంచబోమని , గోవాలోని ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు ఇస్తామని, దయానంద్ సామాజిక్ సుర్కాశ యోజన (డీఎస్‌ఎస్‌వై) కింద పెన్షన్‌ను రూ.3,000కు పెంచుతామని బీజేపీ మంగళవారం హామీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఎల్‌పిజి సిలిండర్లు, పెట్రోలు మరియు డీజిల్ (Diesel)  ధరల పెరుగుదలపై బీజేపీ తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన సంగ‌తి తెలిసిందే.. అయితే తాజాగా గోవా ఎన్నిక‌ల్లో ఇంధనంపై హామీ ఇవ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అలాగే పెట్రోల్‌పై లీటరుకు రూ. 80 పరిమితి చేస్తానని మ్యానిఫెస్టో హామీ ఇచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో మైనింగ్ కార్యకలాపాలను పునరుద్ధరిస్తామని బీజేపీ మరోసారి హామీ ఇచ్చింది.

    Assembly Election 2022: అక్క‌డ ఏ పార్టీ గెలిస్తే.. వారిదే అధికారం.. 1957 నుంచి అదే సెంటిమెంట్!

    ప‌ర్యాట‌కుల సంఖ్య పెంచుతాం..
    మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, మనోహర్ పారికర్ కళ్యాణ్ ఫండ్‌ను ప్రవేశపెడతామని బిజెపి ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చింది. ఇది ప్రతి పంచాయతీకి రూ.3 కోట్ల‌ వరకు ప్రతి మున్సిపాలిటీకి రూ.5 కోట్ల వరకు ఉమ్మడి అభివృద్ధి నిధిని అందిస్తామ‌ని తెలిపింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చే వార్షిక పర్యాటకుల సంఖ్యను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది.

    Assembly Elections 2022: కాంగ్రెస్ రాత‌ను చన్నీ మారుస్తారా.. పంజాబ్‌లో పార్టీ ప‌రిస్థితి ఏంటీ?

    ఉచితంగా తీర్థ‌యాత్ర‌ల‌కు పంపిస్తాం..
    అయితే ఈ సారి రాష్ట్రంలో ఆప్ (AAP) అధికారంలోకి రావాల‌ని ఎంతో ప్ర‌య‌త్నం చేస్తుంది. ఎన్నిక‌ల వేడి ప్రారంభంలోనే ఆప్ ప్ర‌జ‌ల‌కు మ‌రో హామీ ఇచ్చింది. తామకు అధికం ఇస్తే.. ప్రజలను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళ్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హామీ ఇచ్చా రు. గోవాలోని హిందువులను అయోధ్యకు, క్రైస్తవులను వేలంకన్నికి, ముస్లింలను అజ్మీర్‌ షరీఫ్‌కు అలాగే.. సాయిబాబాను కొలిచే భక్తులను షిర్డికి ఉచితంగా తీసుకెళ్తామని ఆయ‌న హామీ ఇచ్చారు. ఆప్‌ అధికారం లోకి వస్తే ఉచిత విద్యు త్‌, యువతకు ఉద్యో గాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Assembly Election 2022, Goa, Goa Assembly Elections 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు