ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) , పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా (Goa) మరియు మణిపూర్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఈ రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ (BJP) అధికారంలో ఉంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ గెలుపు చాలా కీలకం. ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచారం ప్రధాని మోదీ (PM Modi) చుట్టూ కేంద్రీకృతమై ఉంది. తాజాగా పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపం ప్రస్తుతం ఆ రాష్ట్ర ఎన్నికల్లో హాట్ టాపిక్ కానుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఈ ఎన్నికలు కచ్చితంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఉత్తర్ ప్రదేశ్..
బీజేపీ అతిముఖ్యమైన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ గెలుపు బీజేపీ (BJP) చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ సత్తా మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మోదీ వారసుడిగా పలు వర్గాల్లో అభిప్రాయం ఉంది. యోగీ పాలనలో మెరుపులు లేకున్నా.. శాంతి భద్రత, అవినీతి లేని పాలన బీజేపీకి మెరిట్. లఖింపూర్ వంటి ఘటనలతోపాటు, ప్రతిపక్షాల లోపాయికారి ఒప్పద్దాలు బీజేపీ గెలుపును ప్రభావితం చేయనున్నాయి.
Covid 19 Vaccine: తగ్గేదేలే.. ఐదు రోజుల్లో రెండు కోట్ల డోసులు.. టీనేజర్లకు జోరుగా వ్యాక్సిన్‌లు
ఉత్తరాఖండ్..
గత ఏడాది నాలుగు నెలల్లో రాష్ట్రంలో మూడుసార్లు ముఖ్యమంత్రులను మార్చాల్సిన భాజపాకు ఉత్తరాఖండ్ గట్టి పోటి ఎదురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో 40శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించి కొత్త వారితో పోటీలో నిలబడనుందని సమాచారం. 70 సీట్లు ఉంటే ఉత్తరాఖండ్‌లో ఈ సారి బీజేపీ గట్టిపోటీ తప్పదు.
మణిపూర్..
ఈశాన్య రాష్ట్రాల్లో బాగా బలపడిన బీజేపీ ఈ ఏడాది మణిపూర్ పోరుకు సిద్దమైంది. కాంగ్రెస్ బలహీనపడినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశం కచ్చితంగా ఎన్నికల్లో మార్పు తీసుకొస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
గోవా..
చిన్న గోవాలో ఈ సారి రాజకీయం చాలా వేడెక్కింది. ఆప్, టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలో బరిలో ఉన్నాయి. బీజేపీ నుంచి అధికారం లాక్కోవాలి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఆప్, టీఎంసీ రావడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలోనే బొటా బొటిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి ఈ సారి కూడా అధికారం అంత సులభం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
పంజాబ్..
ఈ రాష్ట్రంలో బలపడడానికి బీజేపీ అంత సులభం కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ సారి ఆప్ వేవ్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే కెప్టెన్ అమరేందర్ సింగ్, మోదీ వేవ్ ప్రభావం చూపితే సంకీర్ణం వైపు పంజాబ్ (Punjab) రాజకీయం మలుపు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
బీజేపీ భవిష్యత్తు ప్రభుత్వ అవకాశాలను పెంపొందించుకోవడమే కాకుండా.. రాజ్యసభలో అలాగే రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడు నాలుగు రాష్ట్రాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assembly Election 2022, Goa, Manipur, Pm modi, PM Narendra Modi, Punjab, Uttar Pradesh Assembly Elections, Uttarakhand