Home /News /national /

ASSEMBLY ELECTION 2022 WHAT IS THE VOTING TREND IN PUNJAB EVK

Assembly Election 2022: పంజాబ్‌లో ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది.. ఎటువైపు మొగ్గే అవ‌కాశం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Punjab Assembly Election 2022 | ఈసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. బ‌హుముఖం నుంచి చ‌తుర్ముఖ పోటీకి మారింది పంజాబ్‌. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ మరియు BJP+ కెప్టెన్ అమరీందర్ సింగ్ కూటమి పంజాబ్‌లో అధికారం కోసం పోటీ ప‌డుతున్నాయి.

ఇంకా చదవండి ...
  ఈసారి పంజాబ్ (Punjab) అసెంబ్లీ ఎన్నిక‌లు చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. బ‌హుముఖం నుంచి చ‌తుర్ముఖ పోటీకి మారింది పంజాబ్‌. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, అకాలీదళ్ మరియు BJP+ కెప్టెన్ అమరీందర్ సింగ్ కూటమి పంజాబ్‌లో అధికారం కోసం పోటీ ప‌డుతున్నాయి. ఈ సారి ప్ర‌జ‌లు ఎవ‌రి న‌మ్ముతారో చెప్ప‌లేనిస్థితి ఉంది. అయితే పంజాబ్ పోలిగ్ బూత్ బ‌య‌ట ప్ర‌జ‌ల మాట‌లు భిన్నంగా ఉన్నాయి. ఈసారి కొత్త వారికి అవ‌కాశం ఇచ్చే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. చ‌ర్చ‌లు జోరుగా సాగాయి. అయితే పంజాబ్‌లో ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని ఎవ‌రూ చెప్ప‌కున్న‌ప్ప‌ట్టికీ.. హంగ్ (Hung) ఏర్ప‌డుతుండొచ్చు అనే అభిప్రాయాన్ని చాలా మంది ఓట‌ర్లు భావిస్తున్నారు.

  ఆమ్ ఆద్మీ పెద్ద పార్టీగా ఆవిర్భ‌వించినా హంగ్ వ‌స్తే ఎలా ఎదుర్కొంటుందో చెప్ప‌డం క‌ష్టంగా ఉంది. కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. ముఖ్య‌మంత్రి చ‌న్నీ ఓడిపోతారు అనే ప్ర‌చారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ (Congress) పార్టీ అధ్య‌క్షుడు న‌వజ్యోత్ సిద్దూ గెలుపు ఖాయంలా ఉంది. అయితే అన్నింటిక‌న్నా కీల‌క ప‌రిణామం.. కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం పూర్తి రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేసాల ఉంది.

  అమ‌రీంద‌ర్ సింగ్ (Amarinder Singh)  పార్టీ మెరుగ్గా రాణిస్తే కాంగ్రెస్ మూడో స్థానంలోకి ప‌డ‌పోవ‌డం ఖాయంలా ఉంది. కేజ్రీవాల్‌ను ఖలిస్తాన్ కేసుతో ముడిపెట్టారనే చర్చ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసినప్పటికీ.. ఆల‌స్యంగా ఈ చ‌ర్చ రావ‌డం ఆప్‌కు కాస్త సంతోషించ‌ద‌గ్గ అంశం. అంతే కాకుండా బీజేపీ, అకాలీలకు అనుకూలంగా ఓటు వేయాలన్న బాబా రామ్ రహీమ్ విజ్ఞప్తి చేశారు. ఇది కూడా ఆమ్ ఆద్మీ (Aam Aadmi Party)  పార్టీకి పెద్ద దెబ్బగా స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతుంది. పంజాబ్‌ని రాజ‌కీయంగా మూడు ప్రాంతాలుగా చూడొచ్చు.. మొదటిది మాల్వాలో 69 సీట్లు, రెండవది మంఝా 25 మరియు మూడవది ద్వాబా 23 ప్రాంతం.

  Regional Alliance: బీజేపీని నిలువ‌రించగ‌ల‌రా.. ప్రాంతీయ కుట‌మి బ‌లం, బ‌ల‌హీన‌త ఏమిటీ?

  మాల్వా రీజియన్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గతసారి మంచి పనితీరు కనబరిచింది. 20 సీట్లలో అత్యధికం ఈ ప్రాంతం నుంచే వచ్చాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల పనితీరుపై ప్రభుత్వ ఏర్పాటుకు సమీకరణ ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ మాంఝా, ద్వాబా ప్రాంతంలోకి ప్రవేశించగలిగితే, దాని ప్రభుత్వం ఖాయం. లేనిపక్షంలో పంజాబ్ హంగ్ అసెంబ్లీ దిశగా సాగుతుంది.

  పంజాబ్‌లో ఎప్పుడూ మెజారిటీ ప్రభుత్వం ఉంది, 1967 మరియు 1969 ఎన్నికలు మినహా.. ఈ సారి ఎలా ఉండ‌బోతుంద‌ని ఆస‌క్తి ఉంది. పంజాబ్‌లో దాదాపు 35 శాతం దళిత ఓటర్లు ఉన్నారు. చరణ్‌జిత్‌ చన్నీ దళితుడు కావడం వల్ల ఈ ఓటు బ్యాంకులో కాంగ్రెస్‌కే ఎక్కువ లాభం చేకూరుతుందని, మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ ఓటు బ్యాంకుతోనే అధికారంలోకి వస్తుందని వాపోతున్నారు. దళితుల ఓటు బ్యాంకులో 60% మంది కాంగ్రెస్‌కు, 40% మంది ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్లే అవకాశం ఉంది.

  రెండవ స్థానంలో 20% జాట్ సిక్కు ఓటర్లు ఉన్నారు. వీటిలో ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్ మరియు కాంగ్రెస్ వేర్వేరు ప్రాంతాలకు మరియు అభ్యర్థులకు వెళ్తాయి. జాట్ సిక్కు ఓటర్లలో మొదటి ఎంపిక ఆమ్ ఆద్మీ పార్టీ అని నమ్ముతారు, దీనికి కారణం భగవంత్ మాన్ యొక్క ముఖ్యమంత్రి ముఖమే. రెండవ స్థానంలో అకాలీలు మరియు మూడవ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది.

  ట్రెండ్ ఎలా ఉంది..
  పంజాబ్‌లోని ఓటింగ్ మరియు ఓటర్ వైఖరిని చూస్తుంటే, ఇప్పుడు పంజాబ్ యొక్క వంతు ఆప్ ప్రభుత్వానికి లేదా హంగ్ ప్రభుత్వానికి అని చెప్పవచ్చ‌ని చాలా మంది విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉన్న‌ట్టు చెబుతున్నారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Assembly Election 2022, Congress, Punjab

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు