Home /News /national /

ASSEMBLY ELECTION 2022 UPDATES EC TO ANNOUNCE POLL DATES FOR UP UTTARAKHAND PUNJAB GOAAND AND MANIPUR TODAY AFTERNOON SK

5 state Elections: మళ్లీ ఓట్ల సందడి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నేడే షెడ్యూల్ విడుదల..

సీఈసీ సుశీల్ చంద్ర

సీఈసీ సుశీల్ చంద్ర

5 state Elections: ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ శాసనసభల గడువు మార్చితో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మే నెల వరకు గడువుంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు మార్చి-ఏప్రిల్‌ మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.

    మన దేశంలో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (5 State Assembly Elections) ఎన్నికల నగారా మోగనుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరాఖండ్ (Uattarakhand), పంజాబ్ (Punjab), గోవా (Goa), మణిపూర్ (Manipur) ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడే షెడ్యూల్‌ను ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల దాఖలు, పోలింగ్ తేదీ, కౌంటింగ్ వివరాలన్నింటినీ మధ్యాహ్నం ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో నేటి నుంచే ఆయా రాష్ట్రాల్లో కోడ్ అమల్లోకి వస్తుంది.



    ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ శాసనసభల గడువు మార్చితో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మే నెల వరకు గడువుంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు మార్చి-ఏప్రిల్‌ మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. మన దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ 403 శాసనసభ నియోజకవర్గాలున్నాయి.  ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రస్తుతం యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు.. గెలుపే లక్ష్యంగా ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

    Corona Bulletin: ఉప్పెనలా విరుచుకుపడుతున్న కరోనా థర్డ్ వేవ్...

    ప్రస్తుతం మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది. కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. అలాంటి సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తుండడంపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారాలతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలతో సమావేశమయింది. ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాలా? వాయిదా వేయాలా? అని అభిప్రాయలు తెలుసుకుంది. సకాలంలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయా పార్టీలు సూచించడంతో.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తామని ఇటీవలే ఎన్నికల సంఘం ప్రకటించింది. అటు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతోనూ ఎన్నికల అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి గురించి ఆరా తీశారు. అక్కడ వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని కేంద్రానికి సూచించింది.

    Corona: జనవరి చివరివారంలో రోజుకు అన్ని లక్షల కేసులు.. ఎప్పుడు తగ్గుతాయంటే..

    ఈ ఐదు రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితి
    భారత వైద్యఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. యూపీలో 4,223 కొత్త కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లో నిన్న 813 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పంజాబ్‌లో 2,864, గోవాలో 1,432, మణిపూర్‌లో 48 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఐతే మన దేశంలో కరోనా పాజిటివ్ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గోవా రెండో స్థానంలో ఉంది. ఇవాళ్టి బులెటిన్ ప్రకారం.. అక్కడ 21.72శాతంగా ఉంది. మరి అలాంటి చోట ఎన్నికలు నిర్వహిస్తే.. మరిన్ని ఎక్కువ కేసులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో గోవాలో ఎన్నికలప్రచారంపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బహిరంగ సభలు, ర్యాలీలకు 100 మంది కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదని ఆదేశాలు జారీచేసింది. ఇక ఇండోర్ స్టేడియాల్లో 50శాతం సామర్థ్యానికి అనుమతి ఇచ్చారు. అటు ఉత్తరాఖండ్‌లోనూ జనవరి 16 వరకు ఎన్నికల ర్యాలీ, సభలు, సమావేశాలపై నిషేధం అమల్లో ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: 5 State Elections, Election Commission of India, Goa, Manipur, Punjab, Uttar Pradesh Assembly Elections, Uttarakhand

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు