దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ భవన్ లో శనివారం నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. వివరాలివి..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో మరోసారి మినీ ఎన్నికల సంగ్రామం మొదలైంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ భవన్ లో శనివారం నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే కూడా పాల్గొన్నారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలకు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు సీఈసీ.
కొవిడ్ ఫ్రీ ఎన్నికలు, ఓటర్లకు మరింత సౌకర్యవంతంగా, పోలింగ్ శాతం మరింత పెరిగేలా చేయడాన్ని ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని సుశీల్ చంద్ర చెప్పారు. కొవిడ్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖలు, ఆరోగ్య నిపుణులు అందరితో చర్చించిన తర్వాతే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతున్నామని సుశీల్ చంద్ర చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అత్యంత ఆవశ్యకమైనవి గనుక కరోనా పరిస్థితుల్లోనూ తప్పక ప్రక్రియ నిర్వహిస్తున్నామని సీఈసీ చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ లో కీలక అంశాలివే..
-మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి..
-ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య 8.55 కోట్లుగా ఉంది.
-కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ సమయం గంట పెంపు
-కరోనా నేపథ్యంలో ఒక పోలింగ్ బూత్ లో గరిష్టంగా ఓటేసే ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1250కి తగ్గించారు.
-జనవరి 15 వరకు ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలకు అనుమతి లేదని, సదరు కార్యక్రమాలు రద్దవుతాయని ఈసీ స్పష్టం చేసింది.
-పోలింగ్ బూత్ ల సంఖ్య 2.16 లక్షలకు పెరిగింది. గతంతో పోల్చుకుంటే 16 శాతంపెరుగుదల
-కొవిడ్ నేపథ్యంలో ఆన్ లైన్ లోనే నామినేషన్ దాఖలు చేసే వెసులుబాటు
-అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు నేర చరితను, కేసుల జాబితాను తప్పనిసరిగా ప్రకటించాలి. ఆ అభ్యర్థికే ఎందుకు అవకాశం కల్పించారో వివరించాలి.
-సమస్యాత్మక పోలింగ్ బూత్ లలో వెబ్ కాస్టింగ్ లైవ్ ప్రసారం ఏర్పాటు.. మొత్తంగా 60 శాతం పోలింగ్ బూత్ లలో వెబ్ కాస్టింగ్
-పోలీస్, ఈసీ, సాధారణ అబ్జర్వర్లు సుమారు 900 మంది పనిచేస్తారు.
-ఆయా రాష్ట్రాలకు బట్టి అసెంబ్లీ అభ్యర్థుల ఖర్చు పరిమితిని 28 లక్షల నుంచి 45 లక్షలుగా నిర్ధారించారు.
-నమ్మకం ఉంటే దారి కచ్చతంగా దొరుకుతుంది. గాలిలోనూ దీపం వెలుగుతుంది.. అనే మాటను సీఈసీ సుశీల్ చంద్ర వాడారు. కొవిడ్ భయాల నేపథ్యంలో ఈసీ తీసుకున్న జాగ్రత్తలపై ప్రజలు విశ్వాసం ఉంచాలని ఆయన కోరారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.