Home /News /national /

ASSEMBLY ELECTION 2022 TOTAL IN 7 PHASES IN 5 STATES START FROM FEBRUARY 10 ENDS ON MARCH 7 POLL RESULT ON MARCH 10 MKS

7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు: ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్- మార్చి 10న ఫలితాలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు

2022లో మాత్రం ఐదు రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిస్తామని ఈసీ తెలిపింది. తొలి దశ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగనుండగా, చివరిదైన ఏడోదశ పోలింగ్ మార్చి 7న ముగుస్తుంది. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడతాయి.

ఇంకా చదవండి ...
దేశంలో మరోసారి ప్రజాస్వామిక పండుగ వచ్చేసింది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిలకు షెడ్యూల్ విడుదలైంది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీశ్ చంద్ర శనివారం నాడు ఢిల్లీ వేదికగా ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించారు. 2012లో తొమ్మిది ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 2022లో మాత్రం ఐదు రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిస్తామని ఈసీ తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

తొలి దశ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగనుండగా, చివరిదైన ఏడోదశ పోలింగ్ మార్చి 7న ముగుస్తుంది. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడతాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే దశ(రెండో ఫేజ్)లోనే పోలింగ్ పూర్తవుతుంది. ఇక మణిపూర్ లో రెండు దశల్లో(ఐదు, ఆరో ఫేజ్ లో) పోలింగ్ జరుగనుంది. దశల వారీగా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇలా..

Elections Dates 2022: రోడ్ షోలు రద్దు.. ప్రచారానికి covid రూల్స్ అడ్డు : EC సంచలన గైడ్‌లైన్స్



తొలి దశ(యూపీ 1వ ఫేజ్) : జనవరి 14న నోటిఫికేషన్, ఫిబ్రవరి 10న పోలింగ్

రెండో దశ(యూపీ-2, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా) : జనవరి 21న నోటిఫికేషన్, ఫిబ్రవరి 14న పోలింగ్.

మూడో దశ (యూపీ-3) : జనవరి 25న నోటిఫికేషన్, ఫిబ్రవరి 20న పోలింగ్

నాలుగో దశ (యూపీ-4) జనవరి 27న నోటిఫికేషన్, ఫిబ్రవరి 23న పోలింగ్.

ఐదో దశ (యూపీ-5, మణిపూర్ ఫస్ట్ ఫేజ్): ఫిబ్రవరి 1న నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న పోలింగ్.

ఆరోదశ (యూపీ-6, మణిపూర్ రెండో ఫేజ్): ఫిబ్రవరి 4న నోటిఫికేషన్, మార్చి 3న పోలింగ్.

ఏదో దశ (యూపీ-7): ఫిబ్రవరి 10న నోటిఫికేషన్, మార్చి 7న పోలింగ్

ఫలితాలు: అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022

తదుపరి వార్తలు