ASSEMBLY ELECTION 2022 STAR CAMPAIGNERS ENTER THE FIELD CONGRESS HAS RELEASED THE LIST EVK
Assembly Election 2022: రంగంలోకి స్టార్ క్యాంపెయినర్లు.. 30 మంది జాబితా విడుదల చేసిన కాంగ్రెస్!
ప్రతీకాత్మక చిత్రం
Congress Star Campaigners in Uttar Pradesh | దేశ రాజకీయాలను ఎంతో ప్రభావం చూపే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh). ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఒంటరిగా బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని మోయడానికి కాంగ్రెస్ పార్టీ 30 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ రంగంలోకి దింపనుంది.
దేశ రాజకీయాలను ఎంతో ప్రభావం చూపే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh). ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఒంటరిగా బరిలో దిగుతోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ అన్ని తానై ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని మోయడానికి కాంగ్రెస్ పార్టీ 30 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపనుంది. ఈ స్టార్ క్యాంపెయినర్ల (Star Campaigners) జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. స్టార్ క్యాంపెయినర్లలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా, గులాం నబీ ఆజాద్, అశోక్ ఉన్నారు. గెహ్లాట్, భూపేష్ బాఘేల్ మరియు సచిన్ పైలట్ ఉన్నారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
Congress releases a list of 30 star campaigners for the first phase of #UttarPradeshElections
Party chief Sonia Gandhi, ex-PM Dr Manmohan Singh, party leaders Rahul Gandhi, Priyanka Gandhi Vadra, Ghulam Nabi Azad, Ashok Gehlot, Bhupesh Baghel, Sachin Pilot & others to campaign. pic.twitter.com/dyk02cq4Ca
ఇటీవలే రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన సచిన్ పైలట్ (Sachin Pilot), అశోక్ గెహ్లాట్ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఈ సారి ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన సాధిస్తుందని పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.
నిరాశాజనకంగా ఒపినియన్ పోల్స్..
యూపీలో కాంగ్రెస్ కు పది సీట్లు రావడమే కష్టమని ఒపినీయన్ పోల్స్ చెబుతున్నాయి. అయినా ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్లో ప్రతీ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందకు ప్రయత్నిస్తోంది.
బీజేపీ అతిముఖ్యమైన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ గెలుపు బీజేపీ (BJP) చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సత్తా మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మోదీ వారసుడిగా పలు వర్గాల్లో అభిప్రాయం ఉంది. యోగీ పాలనలో మెరుపులు లేకున్నా.. శాంతి భద్రత, అవినీతి లేని పాలన బీజేపీకి మెరిట్. లఖింపూర్ వంటి ఘటనలతోపాటు, ప్రతిపక్షాల లోపాయికారి ఒప్పద్దాలు బీజేపీ గెలుపును ప్రభావితం చేయనున్నాయి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.