త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల (Assembly Election 2022) అసెంబ్లీ ఎన్నికల విజయంపై అన్ని పార్టీలు శాయశక్తులు ఒడ్డుతున్నాయి. ఎలెక్షన్ కమిషన్ ఈ సారి ఎన్నికల నిర్వహణపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా, ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ విజృంభణ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. తాజాగా ఎలెక్షన్ కమిషన్ (Election Commission) అభ్యర్థుల ఖర్చు నియంత్రణకు సంబంధించిన విధివిధానాలను రూపొందించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఖర్చుల చార్ట్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ చార్ట్ ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి దేనికి ఎంత ఖర్చు పెట్టాలో ఎలెక్షన్ కమిషన్ పేర్కొంది.
Assembly Election 2022: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో AIMIM సంచలన నిర్ణయం.. ఓట్ షేర్‌పై ప్రభావం!
చార్ట్ ప్రకారం, ఒక అభ్యర్థి
- నాలుగు పూరీలు, ఒక స్వీట్‌కు రూ.37
- ఒక సమోసా,టీకి రూ.6
- ఒక పూల దండకు ఖర్చు రూ. 16
- మినరల్ వాటర్ బాటిల్ (Water Bottle) ఎమ్మార్పీ ధర ప్రకారం
- ప్రచారానికి వినియోగించే డ్రమ్మర్లకు మనిషికి రూ. 1,575
Assembly Election 2022: ఆ స్థానాల్లో బీజేపీకి గట్టిపోటీ.. ఎస్పీ అవకాశాన్ని వినియోగించుకొంటుందా?
ఇవే కాకుండా ప్రచారానికి వినియోగించే వాహనాలకు కూడా ఎలెక్షన్ కమిషన్ ధరలు నిర్ణయించింది.
- బీఎండబ్ల్యూ (BMW), మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) కారు అద్దెకు తీసుకొంటే ఒక రోజుకు రూ.21,000
- మిత్షుబుషి పజేరో కారుకు రూ. 12,600
- ఇన్నోవా, క్వాలిస్, ఎస్‌యూవీ, ఫార్చ్యునర్ వంటి కార్లకు ఒక రోజుకు రూ.2,300
- స్కార్పియో, జీప్, బొలెరో, సుమోలకు రోజుకు రూ. 1,260 ధరను నిర్ణయించింది.
అభ్యర్థుల మొత్తం ఖర్చు రూ.40 లక్షలు మించకూడదని ఈసీ స్పష్టం చేసింది. గతంలో అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలు ఉండగా ఆ ధరను ఈసీ రూ. 40లక్షలకు ఇటీవలే పెంచింది. ప్రస్తుతం ఈసీ విడుదల చేసిన చార్ట్ ప్రకారం ధరలు చెల్లిస్తున్నారా లేదా అని తెలుసుకొనేందుకు నిరంతరం పర్యవేక్షణ అధికారిని నియమిస్తున్నట్టు ఈసీ తెలిపింది.
డిజిటల్‌పై కూడా..
కరోనా నిబంధనలతో ర్యాలీలు, సమావేశాలపై నిషేధం విధించింది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. సభలు, సమావేశాలు లేకపోవడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి డిజిటల్ (Digital), ఆన్‌లైన్ (Online) ద్వారా తమ ప్రచారానికి తెరల లేపాయి. ప్రత్యేకంగా ప్రచార గీతాలను రూపొందించాయి. వీటిని ఫేస్‌బుక్ (Facebook), యూట్యూ బ్, ట్వి టర్లలో పార్టీ డిజిటల్ వింగ్‌ల ద్వారా జోరుగా ప్రచారం చేయిస్తున్నారు. ప్రత్యేక గేయ రచయితలు, కళాకారులు, సినీ నటులు ఎన్ని కల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నా రు. అన్నిపార్టీలు ఇదే కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.
అయితే డిజిట్ ప్రచారం కదా.. లెక్క తప్పించుకోవచ్చని భావించే పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చింది. డిజిటల్, ప్రచారం, వర్చువ్ మీటింగ్‌లపై పార్టీలు, అభ్యర్థుల వారీగా లెక్కలు చూపాలని దేశించింది. ఈ లెక్కలు చేపించకున్నా.. చట్టపరమైన చర్యలు తప్పవని ఈసీ స్పష్టంచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.