ASSEMBLY ELECTION 2022 NEW TREND IN CAMPAIGNING WHAT ARE THE POLITICAL PARTIES DOING IN FIVE STATES EVK
Assembly Election 2022: ప్రచారంలో నయా ట్రెండ్.. ఐదు రాష్ట్రాల్లో పార్టీలు ఏం చేస్తున్నాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
Assembly Election 2022 | ఓ వైపు దేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. అయితే ఎన్నికల ప్రచారంపై ఎలెక్షన్ కమిషన్ పలు ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలో పార్టీలు రూటు మార్చాయి.
ఓ వైపు దేశంలో కరోనా కేసులు (Corona Cases) భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వద్దు అనలేదు. దీంతో ఎలెక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణకు తేదీలు ప్రకటించింది. కరోనా, ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ విజృంభణ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా నోటిఫికేషన్ (Notification) విడుదల చేయడంతోపాటు ట్విట్టర్లో వెల్లడించింది. శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా (Corona) పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. సభలు, సమావేశాలు లేకపోవడంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి డిజిటల్ (Digital), ఆన్లైన్ (Online) ద్వారా తమ ప్రచారానికి తెరల లేపాయి. ప్రత్యేకంగా ప్రచార గీతాలను రూపొందించాయి. వీటిని ఫేస్బుక్ (Facebook), యూట్యూ బ్, ట్వి టర్లలో పార్టీ డిజిటల్ వింగ్‌ల ద్వారా జోరుగా ప్రచారం చేయిస్తున్నారు. ప్రత్యేక గేయ రచయితలు, కళాకారులు, సినీ నటులు ఎన్ని కల ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నా రు. అన్నిపార్టీలు ఇదే కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.
పంజాబ్‌లో కాం గ్రెస్ ముఖ్య మంత్రిపై సెటైరిక్ కార్టూన్ (Cartoons) లను ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందించి ప్రచారం చేస్తోంది. దీనికి దీటుగా కాంగ్రెస్ (Congress) ఆప్ అధినేత కేజ్రివాల్‌పై వ్యంగ్యం చిత్రాలను విడుదల చేసింది. ఇక ఉత్తరాఖండ్లొ బీజేపీకి వ్యతిరేఖంగా కాంగ్రెస్ వీడిలయోలు రూపొందించి ప్రచారం చేస్తోంది. గోవాలోనూ తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రత్యేక కార్టూన్లు, సెటైరిక్ వీడియలతో ప్రచారం చేస్తోంది.
లెక్క చెప్పాల్సిందే..
అయితే డిజిట్ ప్రచారం కదా.. లెక్క తప్పించుకోవచ్చని భావించే పార్టీలకు ఈసీ షాక్ ఇచ్చింది. డిజిటల్, ప్రచారం, వర్చువ్ మీటింగ్‌లపై పార్టీలు, అభ్యర్థుల వారీగా లెక్కలు చూపాలని దేశించింది. ఈ లెక్కలు చేపించకున్నా.. చట్టపరమైన చర్యలు తప్పవని ఈసీ స్పష్టంచేసింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.