Punjab Assembly Election 2022 | పంజాబ్ ఎలెక్షన్ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు దేశవ్యా ప్తంగా పలు ప్రాంతాలకు చెందిన సిక్కు ప్రముఖులతో భేటీ అయ్యా రు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన వారిని ప్రధాని సాదరంగా స్వాగతించారు.
పంజాబ్ ఎలెక్షన్ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతుంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) నేడు దేశవ్యా ప్తంగా పలు ప్రాంతాలకు చెందిన సిక్కు ప్రముఖులతో భేటీ అయ్యా రు. ఈ ఉదయం తన నివాసానికి వచ్చిన వారిని ప్రధాని సాదరంగా స్వాగతించారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సిక్కు ప్రముఖులు మోదీని సత్కరించారు. ఢిల్లీ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ హర్మీత్‌సింగ్ కల్కా, పద్మశ్రీ (Padma Sri) అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగగ్జీ సిచెవాల్, మహంత్ కరం జిత్‌సింగ్, అమృత్‌సర్‌లోని ముఖి డేరా బాబా తారా సింగ్‌కు చెందిన సంత్ బాబా మేజర్ సింగ్ వా తదితరులు ప్రధానిని కలిసారు.
ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ పం జాబ్ఎ (Punjab) న్నికల్లో కెప్టెన్ అమరీం దర్ సింగ్‌కు చెందిన చెం దిన పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (సం యుక్త్) పార్టీలతో కలిసి బరిలో ఉంది. బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే ఉంటుంని సర్వేలు చెబుతున్నాయి. అయినా బీజేపీ అన్ని రకాలా వ్యూహాలకు పదును పెడుతోంది.
డేరాలదే కీలకం..
పంజాబ్ రాజకీయాల్లో డేరాలు, సిక్కు లకు ప్రత్యే క స్థానం ఉంది. వాటి మద్దతు దక్కిం చుకోగలిగితే ఎన్నికల్లో సులభం గా విజయం సాధిం చొచ్చ అనేది రాజకీయ పార్టీల విశ్వా సం . పంజాబ్‌లో దాదాపు 13 వేల గ్రామాలు ఉన్నాయి. అందులో 9 వేలకు పైగా ఊళ్లలో డేరాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు డేరాల చుట్టూ తిరుగుతన్నాయి.
మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్..
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో.. చాలా కాలంగా మోనంగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కాంగ్రెస్ రంగంలోకి దిప్పింది. ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు విదేశాంగ విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పొరుగు దేశాలతో మన సంబంధాలు క్షీణిస్తున్నాయన్నారు. ఏడాది కాలంగా చైనా (Chine) సైన్యం మన దేశ పవిత్ర భూభాగాన్ని ఆక్రమించుకుంటోందని.. కానీ ప్రభుత్వ చర్యలన్నీ ఈ సమస్యను కప్పి ఉం (Nehru) ను నిందించడమేమిటని నిలదీశారు.
ఓవైపు ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలను ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఏడున్నరేళ్ళ నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించి సరిదిద్దుకోవడానికి బదులుగా.. ప్రజా సమస్యల విషయంలో తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూను నిందిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజిస్తున్నారని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.