Home /News /national /

ASSEMBLY ELECTION 2022 LIVE RESULTS UPDATES COUNTING BEGINS IN UTTAR PRADESH PUNJAB UTTARAKHAND MANIPUR GOA ELECTION RESULTS NEWS IN TELUGU MKS

Assembly Election 2022 Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ షురూ.. అప్‌డేట్స్ ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి మొదలైంది. ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1,200 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

దేశంలో అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ సహా పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి మొదలైంది. గురువారం(మార్చి 10) ఉదయం 8 గంటలకు ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఉత్తరప్రదేశ్‌పైనైతే అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1,200 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తాజా అప్ డేట్స్ ను న్యూస్ 18 తెలుగు వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గోవా ఫలితం తొందరగా, యూపీ ఫలితాలు ఆలస్యంగా వెల్లడికానున్నాయి. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు అమలవుతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులు, ఆ తర్వాతే ఈవీఎం యంత్రాలను కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు.

అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే 750కిపైగా కౌంటింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఈ రాష్ట్రాల్లో 50,000 మందికిపైగా అధికారులను, 671 మంది కౌంటింగ్‌ పరిశీలకులు, 130 మంది పోలీసు పరిశీలకులు, 10 మంది స్పెషల్‌ పరిశీలకులను నియమించారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ.. కరోనా లక్షణాలు కలిగిన వారినెవరినీ కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించరు. తొలుత బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి. గురువారం సాయం త్రం లేదా రాత్రికల్లా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మొత్తం వచ్చేస్తాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్యకాలంలో ఏడు విడతల్లో జరిగాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022

తదుపరి వార్తలు