Home /News /national /

ASSEMBLY ELECTION 2022 LIVE RESULTS CEC SUSHIL CHANDRA DENIED TAMPERING OF EVMS EC SUSPENDS VARANASI ADM AMID EVMS CONTROVERSY MKS

Election 2022 Results : ఈవీఎంల గోల్‌మాల్ వట్టిదే.. ఈసీ ఏ పార్టీకీ తొత్తుకాదు :CEC Sushil Chandra

సీఈసీ సుశీల్ చంద్ర

సీఈసీ సుశీల్ చంద్ర

ఈవీఎల ట్యాంపరింగ్ ఆరోపణల్ని తోసిపుచ్చిన ఈసీ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై చేస్తోన్న తీవ్ర విమర్శలకు సీఈసీ ఘాటుగా బదులిచ్చారు.

దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. గురువారం ఉదయం కౌంటింగ్ మొదలుకాగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. కాగా, యూపీలో సంచలనం రేపిన ఈవీఎం మిషిన్ల తరలింపు, ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ఘాటుగా స్పందించారు. ఈవీఎంల గోల్ మాల్ వట్టిదేనని, అసలు ట్యాంపింగ్ అసాధ్యమన్న ఆయన.. వారణాసి ఘటనలో స్థానిక అధికారులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ మొదలుకాగా, సీఈసీ సుశీల్ చంద్ర ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 1,200 కౌంటింగ్‌ కేంద్రాలున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు నేర నేపథ్యం ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రజలకు చేరవేశామని, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేసిన మొత్తం 6,900 మంది అభ్యర్థులలో 1,600 మందికి పైగా నేరచరిత్ర ఉందన్నారు. ఇక,

ఈవీఎం ట్యాంపరింగ్‌ ఆరోపణలపైనా సీఈసీ సుశీల్ చంద్ర స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్‌ అనే సమస్యే లేదని, 2004 నుంచీ EVMలు సురక్షితంగానే ఉపయోగపడుతున్నాయని అన్నారు. మరింత పారదర్శకత కోసం 2019 నుంచి ప్రతి పోలింగ్ బూత్‌లో VVPATని ఉపయోగించడం మొదలుపెట్టామని గుర్తుచేశఆరు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్‌ వేస్తామని, మళ్లీ ఏజెంట్ల సమక్షంలోనే తెరుస్తామన్నారు. కాగా,

ఈవీఎల ట్యాంపరింగ్ ఆరోపణల్ని తోసిపుచ్చిన ఈసీ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై చేస్తోన్న తీవ్ర విమర్శలకు సీఈసీ ఘాటుగా బదులిచ్చారు. ఈసీ అనేది స్వత్రంత్ర రాజ్యాంగ వ్యవస్థ అని, ఏ ఒక్క రాజకీయ పార్టీకో తొత్తుగా వ్యవహరించబోదని, అన్ని పార్టీల పట్లా ఈసీ పారదర్శకంగానే ఉంటుందని సుశీల్ చంద్ర వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, తదితర ప్రాంతాల్లో పోలింగ్ తర్వాత ఈవీఎంలు ప్రైవేటు స్థలాల్లో పట్టుపడిన ఘటనపై సీఈసీ సుశీల్ చంద్ర వివరణ ఇచ్చారు. స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి ఓట్లు వేసిన ఏ ఈవీఎంను బయటకు తీయలేరని, ఆరోపణలు చేసిన పార్టీలు ఈసీ వివరణతో సంతృప్తిచెందాయన్నారు. వారణాసిలో స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం శిక్షణ అవసరాల కోసం ఈవీఎంల తరలింపు జరిగిందని, అయితే ఆ విషయాన్ని రాజకీయ పార్టీలకు సమాచారం ఇవ్వకపోవడం స్థానిక అధికారుల తప్పేనని, అందుకుగానూ వారిపై చర్యలు తీసుకున్నామని సీఈసీ తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: Assembly Election 2022, Election Commission of India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు