Uttar Pradesh Assembly Elections 2022 | బీజేపీ (BJP) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో యోగీ ఆదిత్యానాథ్ (Yogi Aditya Nath) ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ ఉత్కంఠకు కాస్త తెరదింపింది.
బీజేపీ (BJP) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నికల్లో యోగీ ఆదిత్యానాథ్ (Yogi Aditya Nath) ఎక్కడి నుంచి పోటీ చేస్తారని కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ ఉత్కంఠకు కాస్త తెరదింపింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ శనివారం ప్రకటించింది. ఇది 1967 నుంచి బిజెపి మరియు జన్ సంఘ్‌లు కలిగి ఉన్న పార్టీ కోట. యోగి ఆదిత్యనాథ్ అభ్యర్థిత్వాన్ని అయోధ్య, గోరఖ్‌పూర్ అర్బన్, మథుర అనే మూడు స్థానాల నుంచి ఊహించారు. గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి ముఖ్యమంత్రిని నిలబెట్టాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. ఆదిత్యనాథ్ 1998 నుంచి 2017లో యూపీ ముఖ్యమంత్రి అయ్యే వరకు గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా కూడా ఉన్నారు.
బీజేపీకి కంచు కోట..
గోరఖ్‌పూర్ అర్బన్ (Gorakhpur Urban) సీటు బీజేపీకి అత్యంత సురక్షితమైనది. యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోటగా ఉన్న గోరఖ్‌నాథ్ ఆలయం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో పోటీ చేస్తే యోగీ ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. దీని ద్వారా యోగీ రాష్ట్రమంతా తిరిగే అవకాశం ఉంటుంది పార్టీ భావిస్తోంది. ఈ నెల ప్రారంభంలో యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్.. అయోధ్య, మధుర పోటీ చేస్తారని విపరీతంగా ప్రచారం జరగింది.
దీనిపై అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ప్రజలు యోగి ఆదిత్యనాథ్‌ను గోరఖ్‌పూర్‌కు తిరిగి పంపవలసి వచ్చిందని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని గతంలో యాదవ్ చెప్పినప్పటికీ, ఈ విషయంలో తన పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వెళ్తానని ఆయన తెలిపారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఎస్పీ అధినేత మాయావతి స్పష్టం చేశారు. దీనిపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నుంచి ఎలాంటి సమాచారం లేదు.
గోరఖ్‌పూర్‌లో బీజేపీ
బీజేపీ నాయకుడు రాధా మోహన్ దాస్ (Radha Mohan Singh) అగర్వాల్ 2002 నుంచి గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిగా 2017లో 60,000 ఓట్లతో గెలుపొందారు. అంతకు ముందు, బీజేపీ నాయకులు శివ ప్రతాప్ శుక్లా.. సునీల్ శాస్త్రి వరుసగా 1989 నుంచి 2002, 1980, 1989 వరకు ఈ స్థానంలో గెలిచారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.