Assembly Election 2022 | త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఎలెక్షన్ కమిషన్ పలు ఆంక్షలతో ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది.
త్వరలో ఐదు రాష్ట్రాల (Assembly Election 2022)ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఎలెక్షన్ కమిషన్ పలు ఆంక్షలతో ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా, ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ విజృంభణ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా నోటిఫికేషన్ (Notification) విడుదల చేయడంతోపాటు ట్విట్టర్లో వెల్లడించింది. శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా (Corona) పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిజికల్ ర్యాలీలు, రోడ్షోలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
ECI extends ban on physical rallies and roadshows until 22 January, 2022.
ECI grants relaxation for the political parties to the extent that indoor meetings of maximum of 300 persons or 50% of the capacity of the hall or the prescribed limit set by SDMA https://t.co/MX0tuvKHEq
అంతే కాకుండా ఇక 300 మందితో ఒక సమావేశ మందిరంలో సభలకు అనుమతి ఇస్తూ.. హాల్ కెపాసిటీ లో 50% మందితో సభ నిర్వహించుకోవచ్చని పార్టీలకు అనుమతి ఇచ్చింది ఈసీ. రాజకీయ పార్టీలన్నీ కరోనా ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ముఖ్యంగా దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఎలెక్షన్ కమిషన్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొంది.
ఎన్నికల షెడ్యూల్..
దేశంలో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఉత్తరప్రదేశ్ ఏడు దశల్లో 403 ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది. ఓట్ల లెక్కింపు మొత్తంగా మార్చి 10న జరగనుంది.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కారణంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత పరిస్దితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఇవాళ నిషేధంపై సమీక్ష నిర్వహించి.. పొడగింపు నిర్ణయం వెల్లడించింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.