దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) బీజేపీ గెలుపు చాలా కీలకం. ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (Yogi Aditya Nath) చుట్టూ కేంద్రీకృతమై ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఉత్తర్ ప్రదేశ్‌లో గెలుపుపై చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేకపోవడంపై యువతలో చాలా వ్యతిరేకత ఉంది. ఐదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసిన దానికి అందించిన వాటి మధ్య అంతరంపై స్పష్టమైన తేడా ఉంది. ఇందుకు ప్రధాన కారణం కరోనా (Corona) తో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. అయితే ప్రజల్లో మాత్రం ఉద్యోగ కల్పనలో వెనక బడ్డారు అనే అభిప్రాయం ఉంది. మరో వైపు కేంద్రం నిర్ణయాలైన ఇంధనం మరియు వంటగ్యాస్ ధరలపై అసంతృప్తి ఎక్కవగా ఉంది. ఇవ్వన్ని గెలుపై చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Uttar Pradesh Elections: ఆ స్థానాల్లో బీజేపీకి గట్టిపోటీ.. ఎస్పీ అవకాశాన్ని వినియోగించుకొంటుందా?
ప్రధాన ఇబ్బందులు
వ్యవసాయ చట్టాల ద్వారా రైతుల్లో ఏర్పడిన వ్యతిరేకత. సాగు చట్టాలను రద్దు చేసినప్పటికీ రైతుల మనసును బీజేపీ గెలుచుకోలేక పోయిందనేది వాస్తవం. కారణాలు ఏదైనా ఉద్యోగ కల్పన, ధరల పెరుగుదల బీజేపీ (BJP) ప్రతికూలాంశాలు కానున్నాయి. నాలుగేళ్లుగా ఒక్క భారీ నోటిఫికేషన్ కూడా యోగి సర్కార్ వేయలేదు. ఇటు ప్రతిపక్షాలు తమ ఎన్నికల వాగ్దానాల్లో 20 నుంచి 30 లక్షల ఉద్యోగాలు వేస్తామని హామీలు గుప్పిస్తున్నాయి. వీటికి కౌంటర్ యోగి ప్రభుత్వం వద్ద లేదు.
Assembly Election 2022: జనం ఎటువైపు.. ఐదు రాష్ట్రాల్లో పార్టీల గెలుపు అవకాశాలపై సర్వే
కలిసొచ్చే అంశాలు..
ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇప్పటికీ ప్రధాన మార్పు విద్యుత్ సరఫరా. విద్యుత్ సరఫరాలో యోగి ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా చిన్న తరహా వ్యాపార వర్గాల్లో కాస్త సంతృప్తి వ్యక్తం అవుతుంది. కోవిడ్ లాక్‌డౌన్ కష్టాలను తగ్గించడానికి ప్రారంభించిన ఉచిత రేషన్, బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా అత్యంత ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో చాలా పారదర్శకతను యోగి సర్కార్ సాధించింది.
గెలుపు ఉపయోగపడే అంశం..
ఎన్ని వ్యతిరేక అంశాలు ఉన్నా.. యోగి విజయానికి దోహదం చేసేది శాంతిభద్రతలు. ఉత్తర్ ప్రదేశ్ వాసులకు ఈ విషయంలో యోగికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. గతంలో గల్లీలో రౌడీలు కూడా దుకాణాదారుల నుంచి మామూళ్లు వసూలు చేసేవారి యోగి వచ్చాక మారిందని చాలా మంది చెబుతున్నారు. ముఖ్యంగా సొంతంగా వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు ఈ అంశంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. యోగి ప్రభుత్వం వచ్చాక వేల సంఖ్యలో ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. దీనిపై ఇప్పటికే మానవ హక్కు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లో మాత్రం భిన్నంగా ఈ అంశంలో సానుకూలంగా ఉన్నారు. ఉపాధి కల్పన, ధరల పెరుగుదల కంటే ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ వాసులు శాంతి భద్రతలకే ఓటు వేస్తారని పలు ఒపినియన్ పోల్ సర్వే (Opinion Poll Survey)ల్లో వెల్లడవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.