Assembly Election 2022 | దేశ రాజకీయాలను ఎంతో ప్రభావం చూపే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh). ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయి. తాజాగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్తగా మ్యానిఫెస్టోని సిద్ధం చేసింది.
దేశ రాజకీయాలను ఎంతో ప్రభావం చూపే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh). ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయి. తాజాగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్తగా మ్యానిఫెస్టోని సిద్ధం చేసింది. యువకులే టార్గెట్‌గా మేనిఫెస్టోలో హామీ వర్షం కురిపించింది. శుక్రవారం దిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యా లయంలో ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. మెనిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రతీ గంటకు 880మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆరోపించింది. బీజీపీ అధికారంలోకి వచ్చాక 16 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) , పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా (Goa) మరియు మణిపూర్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. ఈ రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ (BJP) అధికారంలో ఉంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ గెలుపు చాలా కీలకం. ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచారం ప్రధాని మోదీ (PM Modi) చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
బీజేపీ అతిముఖ్యమైన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ గెలుపు బీజేపీ (BJP) చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సత్తా మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. మోదీ వారసుడిగా పలు వర్గాల్లో అభిప్రాయం ఉంది. యోగి పాలనలో మెరుపులు లేకున్నా.. శాంతి భద్రత, అవినీతి లేని పాలన బీజేపీకి మెరిట్. లఖింపూర్ వంటి ఘటనలతోపాటు, ప్రతిపక్షాల లోపాయికారి ఒప్పద్దాలు బీజేపీ గెలుపును ప్రభావితం చేయనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఏఐఎంఐఎం 100 స్థానాల్లో పోటీ చేస్తోంది. దీంతో భారీగా ఓట్ షేర్ చీలే అవకాశం ఉంది. ఈ పరిణామం ఎవరికి లబ్ధి చేకూరుతుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.