Uttar Pradesh Assembly Elections 2022 | త్వరలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టాయి. అభ్యర్థుల ఎంపికలో తీవ్రకసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ 159 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
త్వరలో ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టాయి. అభ్యర్థుల ఎంపికలో తీవ్రకసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ 159 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఎస్పీ సీఎం అభ్యర్థి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలిసి పోయింది. జాబితా ప్రకారం, మాజీ ముఖ్యమంత్రి మరియు పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ నుంచి ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం ములాయం సింగ్ యాదవ్ మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 1993 నుంచి బీజేపీ (BJP)కి చెందిన సోబరన్ సింగ్ యాదవ్ విజయం సాధించిన 2002 నుంచి మినహా కర్హాల్ SP ద్వారా గెలుపొందారు. అంతే కాకుండా అగ్రనేతలైన సీనియర్ నాయకుడు ఆజం ఖాన్, అతని కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ కూడా జాబితాలో ఉన్నారు.
ఇప్పటి వరకు ఉత్తర్ ప్రదేశ్‌లో ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. దాదాపు 100 స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎమ్ఐఎమ్ పార్టీ అధ్యక్షుడు ఓవైసీ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లో మొత్తం 17 మంది అభ్యర్థుల పేర్కలొ వెల్లడించారు. తొలి జాబితాలో 9 మంది. రెండో జాబితాల్లో 8 మంది పేర్లను ప్రకటించారు.
దేశ రాజకీయాలను ఎంతో ప్రభావం చూపే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh). ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఒంటరిగా బరిలో దిగుతోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ అన్ని తానై ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లో కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమయంలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని మోయడానికి కాంగ్రెస్ పార్టీ 30 మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపనుంది. ఈ స్టార్ క్యాంపెయినర్ల (Star Campaigners) జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది.
స్టార్ క్యాంపెయినర్లలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా, గులాం నబీ ఆజాద్, అశోక్ ఉన్నారు. గెహ్లాట్, భూపేష్ బాఘేల్ మరియు సచిన్ పైలట్ ఉన్నారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.