Uttar Pradesh: దేశ రాజకీయాలను ఎంతో ప్రభావం చూపే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుంగా పోటీకి సిద్ధమయ్యే AIMIM ఈ ఎన్నికల్లో సంచలన నిర్ణయం తీసుకొంది.
దేశ రాజకీయాలను ఎంతో ప్రభావం చూపే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh). ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంటున్నాయి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ముందుంగా పోటీకి సిద్ధమయ్యే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (All India Majlis-e-Ittehadul Muslimeen) - (AIMIM) పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకొంది. ఎందుకంటే అక్కడ చాలా నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా అధికం. ఏఐఎమ్ఐఎమ్ సాంప్రదాయ ఓటు ఎక్కువగా వారే. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్లు సాధించాలని ఏఐఎమ్ఐఎమ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకొంది. గతంలో ఎన్నడూ ముస్లిమేతరులు ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) నుంచి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయలేదు. ఈ సారి ఉత్తర్ ప్రదేశ్‌లో పూర్తి భిన్నంగా తొలిసారి ముస్లిమేతరుడికి టికెట్ ఇస్తున్నట్టు ఏఐఎమ్ఐఎమ్ ప్రకటించింది. దీంతో ఓట్ షేర్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
రెండు జాబితాలు విడుదల..
ఇప్పటి వరకు ఉత్తర్ ప్రదేశ్‌లో ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. దాదాపు 100 స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎమ్ఐఎమ్ పార్టీ అధ్యక్షుడు ఓవైసీ ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు జాబితాల్లో మొత్తం 17 మంది అభ్యర్థుల పేర్కలొ వెల్లడించారు. తొలి జాబితాలో 9 మంది. రెండో జాబితాల్లో 8 మంది పేర్లను ప్రకటించారు.
తొలిసారి ముస్లిమేతరులకు..
తమ విధానాలకు భిన్నంగా తొలిసారి ముస్లీమేతరులకు పార్టీ టికెట్‌ను ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం విశేషం. సాహిబాబాద్ నుంచి బ్రాహ్మణ అభ్యర్థి పండిట్ మన్మోహన్ ఝ గామాకు AIMIM టిక్కెట్ ఇచ్చింది. ఇది కచ్చితంగా ఓటింగ్ ప్రభావం చూపే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. సాహిబాబాద్ అసెంబ్లీలో బీహార్‌కు చెందిన దాదాపు మూడు లక్షల మంది నివసిస్తున్నారు. అందులో దాదాపు లక్షన్నర జనాభా కూడా ముస్లింలు ఉన్నారు. ఈ ప్రాంతంలో ముస్లిమేతరుడికి టికెట్ ఇవ్వడం పెద్ద మార్పుగా భావించ వచ్చని ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలపై నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓట్ షేర్‌పై ప్రభావం
సాధారణంగా ఏఐఎమ్ఐఎమ్ సంప్రదాయ ఓటు ముస్లింగా ఉంటున్నారు. తాజా నిర్ణయంతో వీరితోపాటు అభ్యర్థి ఓట్లు కూడా పడతాయని ఏఐఎమ్ఐఎమ్ భావిస్తోంది. లక్షన్నర జనాభా కూడా ముస్లింలు ఉన్న సాహిబాబాద్‌లో హిందువుకు టికెట్ ఇచ్చి ఏఐఎమ్ఐఎమ్ ఓట్ షేర్‌పై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తోంది. ఏఐఎమ్ఐఎమ్ టికెట్ ఇచ్చిన అభ్యర్థి మదన్ మోహన్ ఝా బీహార్ (Bihar) లోని సీతామర్హికి చెందిన వాడు. ఇప్పటివరకు ఏఐఎమ్ఐఎమ్ 17 మంది అభ్యర్థుల జాబితాలో పండిట్ మన్మోహన్ ఝా ఒక్కరే హిందూ అభ్యర్థి కావడం విశేషం.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.