Home /News /national /

ASSEMBLY ELECTION 2022 60 PERCENT POLITICIAN PARTY DEFECTIONS IN FIVE YEARS INTERESTING FACTS IN ADR SURVEY EVK

Assembly Election 2022: ఐదేళ్ల‌లో 60శాతం మంది పార్టీ ఫిరాయించారు.. ఏడీఆర్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు

గోవా అసెంబ్లీ (ఫోటో క్రెడిట్ - ట్విట్ట‌ర్‌)

గోవా అసెంబ్లీ (ఫోటో క్రెడిట్ - ట్విట్ట‌ర్‌)

Assembly Election 2022 | ప్ర‌తీ రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌తినిధులు చాలా మంది పార్టీలు మారూతూనే ఉంటారు. కానీ మ‌రీ రాష్ట్రంలో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో 60శాతం పార్టీ మార‌డం అంటే కాస్తా వింత‌గానే ఉంది. ఆ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. గోవా ఎన్నిక‌ల‌పై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదిక ఆస‌క్తిక‌ర అంశాలు తెలిపింది.

ఇంకా చదవండి ...
  ప్ర‌తీ రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌తినిధులు చాలా మంది పార్టీలు మారూతూనే ఉంటారు. కానీ మ‌రీ రాష్ట్రంలో ఉన్న ప్ర‌జాప్ర‌తినిధుల్లో 60శాతం పార్టీ మార‌డం అంటే కాస్తా వింత‌గానే ఉంది. ఆ రాష్ట్రంలో రాజ‌కీయాలు (Politics) ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇలానే కొన‌సాగితే ప్ర‌జ‌ల్లో పార్టీలు, నాయ‌కుల ప‌ట్ల విశ్వ‌స‌నీయత కొర‌వ‌డే అవ‌కాశం ఉంది. గోవా (Goa)లో ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.అయితే భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపూర్వమైన రికార్డును గోవా నెలకొల్పిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (Association for Democratic Reforms) తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత అసెంబ్లీ (2017-2022) ఐదేళ్ల కాలంలో 24 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలు మారారు. ఇది సభ మొత్తం బలంలో 60 శాతం. భారతదేశంలో మరెక్కడా కూడా ఇలా జ‌ర‌గ‌లేదు. అని స‌ర్వే తెలిపింది.

  Indian Army: భార‌త అమ్ముల పొదిలో మ‌రో ఆయుధం.. సుల‌భంగా ల‌క్ష్యాల‌ను ఛేదించే AT4

  2017 నుంచి..
  మొద‌ట‌గా 2017లో పార్టీ మారిన 24 మందిలో కొంద‌రు బీజేపీలో చేరారు. అనంత‌రం
  2019లో పది మంది కాంగ్రెస్ (Congress) శాసనసభ్యులు బీజేపీలో చేరారు. త‌ర్వాత
  మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) ఎమ్మెల్యేలు దీపక్ పౌస్కర్ (సన్‌వోర్డెమ్), మనోహర్ అజ్‌గావ్‌కర్ (పెర్నెమ్) కూడా అదే సమయంలో బిజెపిలోకి మారారు. ఈ పార్టీతో పాటు సాలిగావ్‌కు చెందిన గోవా ఫార్వర్డ్ పార్టీ (జిఎఫ్‌పి)కి చెందిన జయేష్ సల్గోంకర్ కూడా బిజెపిలో చేరారు. ఇటీవల, గోవా మాజీ ముఖ్యమంత్రి, పోండా నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి నాయక్ అధికార కాషాయ పార్టీలో చేరారు.

  PM Narendra Modi: అత్య‌ధిక ఆమోదం.. వ్య‌తిరేక‌త ఆయ‌కే.. జీఎల్ఏఆర్ స‌ర్వేలో ఆసక్తిక‌ర విష‌యాలు!

  కొత్త‌గా టీఎంసీవైపు చూపు..
  త్వ‌ర‌లో ఫిబ్రవరి 14, 2022న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)లో మరో మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు లూయిజిన్హో ఫలేరో (నవేలిమ్) చేరారు. 2017లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) టికెట్‌పై గెలిచిన మాజీ సిఎం చర్చిల్ అలెమావో కూడా ఇటీవల టిఎంసికి మారారు.కర్టోరిమ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన అలెక్సో రెజినాల్డో లౌరెన్కో కూడా టీఎంసీలోకి చేర‌డం విశేషం.

  Assembly Election 2022: ఆ స్థానాల్లో బీజేపీకి గ‌ట్టిపోటీ.. ఎస్పీ అవ‌కాశాన్ని వినియోగించుకొంటుందా?

  అతిపెద్ద పార్టీ నుంచి..
  2017 ఎన్నికలలో, 40 మంది సభ్యుల సభలో 17 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది, అయితే 13 మందిని గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచిన బిజెపి వేగంగా.. కొంద‌రు స్వతంత్రులు, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోని అధికారం కైవ‌సం చేసుకొంది. దీంతో కాంగ్రెస్ అధికారానికి దూరం అయ్యింది.

  Assembly Elections : అప్పుడు లెక్క‌లేని పార్టీ.. ఇప్పుడు లెక్క‌లు మారుస్తోంది.. ర‌స‌వ‌త్త‌రంగా పంజాబ్ రాజ‌కీయం!

  ప్ర‌స్తుతం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత ప్రస్తుతం సభలో కాంగ్రెస్ బలం రెండు కాగా, బీజేపీ బలం 27 ఉంది. గోవా రాజ‌కీయాల్లో TMC ప్రవేశం, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP కూడా చేరింది. ఇప్పటివరకు, ప్రాంతీయ MGP (ఎంజీపీ), TMC (టీఎంసీ)ల‌ మధ్య ఇటు కాంగ్రెస్, GFP (జీఎఫ్‌పీ)ళ‌ మధ్య పొత్తు ఏర్ప‌డింది.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Assembly Election 2022, Bjp, Congress, Goa, TMC

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు