హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అర్ధరాత్రి నేషనల్ పార్కులో సీఎం బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జంతుప్రేమికులు.. అసలేం జరిగిందంటే...

అర్ధరాత్రి నేషనల్ పార్కులో సీఎం బిశ్వశర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జంతుప్రేమికులు.. అసలేం జరిగిందంటే...

ఓపెన్ ఎస్ యూవీలో ప్రయాణిస్తున్న జగ్గీవాసుదేవ్, సీఎం బిశ్వశర్మ

ఓపెన్ ఎస్ యూవీలో ప్రయాణిస్తున్న జగ్గీవాసుదేవ్, సీఎం బిశ్వశర్మ

Assam: ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్,సీఎం బిశ్వశర్మ అర్ధరాత్రి కజిరంగా నేషనల్ పార్క్ లో ప్రవేశించారు. ఈ ఘటనపై ఇప్పుడు తీవ్ర దుమారం తలెత్తింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Assam, India

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈశా ఫౌండేషన్ ను స్థాపించిన సద్గురు జగ్గీదేవ్ వాసుదేవ్(Sadhguru Jaggi vasudev)  వివాదంలో చిక్కుకున్నారు. కాగా, జగ్గీ వాసుదేవ్ ను, పండిత్ రవిశంకర్ ను అస్సాం అటవీ శాఖ కజీరంగలో ఒక పార్కును ప్రారంభించడానికి ఆహ్వానించారు. అయితే.. ఈ నేపథ్యంలో వీరితో పాటు అనేక మంది శిష్యులు హజరయ్యారు. ఇదిలా ఉండగా సద్గురు జగ్గీ వాసుదేవ్, సీఎం బిశ్వశర్మ (Biswa sharma)  అర్ధరాత్రి కజిరంగ నేషనల్ పార్కులోకి ప్రవేశించారు. దీనిపై తీవ్ర దుమారం తలెత్తింది. వన్యప్రాణుల రక్షణ చట్టం.. 1972 ప్రకారం, జంతువులను సంరక్షించడానికి, వాటి ఆవాసాలను సాపేక్షంగా తాకకుండా ఉంచడానికి నిర్ణీత సమయం తర్వాత జాతీయ ఉద్యానవనంలో సఫారీ లలో మానవులు పర్యటించడం నిషేధించబడిందని జంతు ప్రేమికులు పేర్కొన్నారు. దీనిపై కనీస అవగాహాన లేకుండా ఎలా వెళ్లారని అన్నారు.

పర్యటనలో హిమంత్ బిశ్వశర్మ, బారుహ్ లతో కలిసి సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓపెన్ టాప్ కారులో ప్రయాణిస్తున్నారు. కాగా, దీనిపై అసోం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంకె యాదవ మాట్లాడుతూ.. సద్గురువును, ముఖ్యమంత్రిని ఆహ్వానించింది అటవీ శాఖేనని అన్నారు. ప్రస్తుతం సీఎం, జగ్గీ వాసుదేవ్ నేషనల్ పార్కులో ప్రవేశించడంపై చర్యలు తీసుకొవాలని గోలఘాట్ జిల్లా కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ను ప్రకారం.. రాత్రి సాయంత్రం 4 గంటల తర్వాత.. నేషనల్ పార్కులోకి (Kaziranga Park) ఇతరులు ప్రవేశించరాదు. అలాంటిది.. సీఎం హిమంత్ బిశ్వశర్మ, సద్గురు వాసుదేవ్, జయంత మల్లా బారుహ్ లు సాయత్రం 6 తర్వాత.. కజిరంగ పార్కులోకి ప్రవేశించడం వివాదానికి దారితీసింది.

ఇదిలా ఉండగా ఒడిశాలో 1948లో స్థాపించిన డిస్ట్రిక్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ విభాగం, బెర్హంపూర్ నగరంలోని ఒక భవనం కేంద్రంగా పనిచేస్తోంది.

ఇటీవల DI ఆఫీస్ పేరును డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్‌ ఆఫీస్‌గా మార్చారు. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ఆఫీస్‌ను రెండు సంవత్సరాల క్రితం కొత్త భవనానికి మార్చారు.దీంతో పాత ఆఫీస్‌ను మూసివేశారు. అయితే పాత ఫైల్స్‌ అన్నీ అక్కడే ఉండటంతో, ఈ ఆఫీస్ పర్యవేక్షణ బాధ్యతలను ప్యూన్ M పీతాంబర్‌కు అప్పగించి, అతడిని వాచ్ అండ్ గార్డుగా నియమించారు. అప్పటి నుంచి అధికారులు గానీ, సందర్శకులు గానీ పాత ఆఫీస్‌కు వెళ్లడం లేదు.

మాయమైన ఫైళ్లు, ఫర్నీచర్

అయితే కొన్ని పాత ఫైళ్ల కోసం ఇటీవల ఈ ఆఫీస్‌కు వెళ్లారు విద్యాశాఖ సెక్షన్ ఆఫీసర్ జయంత్ కుమార్ సాహు. లోపలికి వెళ్లిన జయంత్, ఆఫీస్ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉండాల్సిన పాత ఫైళ్లు, అల్మారాలు, ఫర్నీచర్ అన్నీ మాయమయ్యాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి బెర్హంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారణ సందర్భంగా కీలక వివరాలు రాబట్టారు బెర్హంపూర్ పోలీసులు. ఆఫీస్ ఫర్నీచర్‌ను వాచ్‌ గార్డు పీతాంబర్‌ అమ్ముకున్నట్లు గుర్తించి, శనివారం అతడిని అరెస్టు చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Assam, Sadhguru Jaggi Vasudev, VIRAL NEWS

ఉత్తమ కథలు