హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Assam Accident: ఛఠ్ పూజకు వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ.. 10 మంది భక్తులు మృతి

Assam Accident: ఛఠ్ పూజకు వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ.. 10 మంది భక్తులు మృతి

రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదం

Assam Road Accident: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడిపాడని.. ఆ క్రమంలోనే అదుపుతప్పి ఆటోపైకి దూసుకెళ్లాడని చెప్పారు. ప్రమాదం అనంతరం ఘటనా స్థలం నుంచి అతడు పారిపోయాడని పోలీసులకు వివరించారు.

ఇంకా చదవండి ...

ఛఠ్ పూజ వేళ అస్సాంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. త్రిపుర సరిహద్దులోని కరీంగంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ట్రక్కు అతి వేగంతో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా తుక్కుతుక్కయింది. అందులో ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. గురువారం ఉదయం 07.30 గంటల సమయంలో బైతాఖల్ సమీపంలో ఎన్‌హెచ్-8పై ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది మంది స్పాట్‌లోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా ఛఠ్ పూజ ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Karnataka: అమ్మవారి హుండీలో వింత లేఖలు.. ఇలా కూడా ఉంటారా? కోరికలు మామూలుగా లేవుగా..

మ‌ృతులను తుజాబాయి పనీక, సాలుబాయి పనీక, గౌరవ్‌దాస్ పనీక, శంభుదాస్ పనీక, లాలన్ గోసామి, పూజ గోర్హ్, దేబ్ గోర్హ్, సాను రీ, మంగ్లే కర్మాకర్‌గా గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడిపాడని.. ఆ క్రమంలోనే అదుపుతప్పి ఆటోపైకి దూసుకెళ్లాడని చెప్పారు. ప్రమాదం అనంతరం ఘటనా స్థలం నుంచి అతడు పారిపోయాడని పోలీసులకు వివరించారు. లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

Chennai Floods: చెన్నై మునిగిపోతుందా? వామ్మో.. ఏంటా వర్షాలు.. ఎక్కడ చూసినా వరదే..

జనవరి 1, 2022 నాడు ప్రమోషన్ పొందేవాడు.. ఆ పని చేసినందుకు ఇలా అయ్యాడు

రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించిన ఘటన పట్ల అసోం అటవీ,ఎక్సైజ్ శాఖ మంత్రి పరిమళ్ శుక్లబైద్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు.

First published:

Tags: Assam, Road accident

ఉత్తమ కథలు