ఈశాన్య రాష్ట్రం మిజోరం (Mizoram)లో తీవ్ర కలకలం రేగింది. ఏకంగా 2,500 కిలోల పేలుడు పదార్థాలు (Explosives recovered in Mizoram) పట్టుబడ్డాయి. సైన్యం యుద్ధ సమయంలో ఆయుధాలను తరలించినట్లుగా. .. కొందరు వ్యక్తులు భారీ మొత్తంలో బాంబులను తరలిస్తూ దొరికిపోయారు. మయన్మార్ (Myanmar) సరిహద్దులో ఉన్న జవ్‌గ్లింగ్ జిల్లా సైహా గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ మినీ ట్రక్కు నిండా బాంబులను తరలిస్తున్నారని సమాచారం రావడంతో అస్సాం రైఫిల్స్ (Assam Rifles) బలగాలు రంగంలోకి దిగాయి. మిజోరాం పోలీసులతో కలిసి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. తుయ్‌పాంగ్-జవ్‌గ్లింగ్ రోడ్డుపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఓ అనుమానాస్పద ట్రక్కు అటుగా వచ్చింది. మిజోరం రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ ట్రక్కును తనిఖీ చేస్తే.. పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. అందులో ఉన్న పేలుడు పదార్థాలను చూసి అధికారులు షాక్ తిన్నారు. ఆర్మీ సిబ్బంది యుద్ధానికి వెళ్తున్నట్లుగా ఎంతో దర్జాగా ఆయుధాలను తరలిస్తున్నారు.
Narendra Modi: నరేంద్ర మోదీయే ప్రపంచ నెంబర్ వన్.. ఇంకెవరైనా ఆయన తర్వాతే..
మినీ ట్రక్కు నుంచి 2,500 కిలోల పేలుడు పదార్ధాలను, 4,500 మీటర్ల డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.73,500 భారత కరెన్సీ, 9,35,000 క్యాట్ల మయన్మార్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కును సీజ్ చేసి.. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు భారతీయులు.. మరొకరు మయన్మార్ దేశానికి వ్యక్తి ఉన్నారు. మయన్మార్ దేశస్థుడు ఆ దేశానికి చెందిన చిన్ నేషనల్ ఫ్రంట్ (CNF) సభ్యుడిగా మిజోరాం పోలీసులు గుర్తించారు. అసలు వీరంతా ఎవరు? పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎలాంటి కుట్రలకు ప్లాన్ చేశారు? అని కూపీ లాగుతున్నారు.
Utpal Parrikar: బీజేపీకి మనోహర్ పారికర్ కొడుకు గుడ్‌బై..కమలానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో
సీఎన్ఎఫ్.. మయన్మార్‌లో ఒక రాజకీయ వేదిక. ఆత్మ గౌరవం, జాతి సమానత్వం, ప్రజాస్వామ్య నినాదాలతో ఫెడరల్ యూనియన్ కోసం పోరాడుతోంది. ప్రస్తుతం మిజోరాంలో ఎంతో మంది మయన్మార్ శరణార్థులు ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరిగిన తర్వాత.. ఎంతో మంది ఉన్న ఊళ్లను వదలిపెట్టి మన దేశానికి వస్తున్నారు. వారిలో అత్యధికులు చిన్ వర్గానికి చెందిన వారే ఉన్నారు. వీరిని జో సామాజిక వర్గం అని కూడా పిలుస్తారు. వీరి పూర్వీకులు, సంస్కృతి సంప్రదాయలు కూడా అచ్చం మిజోరంలోని మిజోలను పోలి ఉంటాయి. అలాంటి వ్యక్తులు పెద్ద మొత్తంలో బాంబులను తరలించడం మిజోరాంలో చర్చనీయాంశంగా మారింది. వీరు మయన్మార్‌లో ఏదైనా విధ్వంసానికి స్కెచ్ వేశారా? లేదంటే ఇండియాలోనే ఏదైనా ప్లాన్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాశ్మీర్లో షట్టర్స్ క్లోజ్..కఠిన వీకెండ్ లాక్డౌన్ అమలు
ఇండో మయన్మార్ సరిహద్దులో ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడడం భద్రత దళాలు ఇటీవల సాధించిన అతి పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు. సంఘవిద్రోహ చర్యలకు శక్తులకు నిజంగా పెద్ద ఎదురు దెబ్బగా అధికాారులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Explosives, Mizoram, Myanmar