Indian Railways: హత్యల కేసులో దోషిగా తేలిన ట్రైన్ ఇంజిన్... అరెస్టు, సీజ్ చేసిన అధికారులు

Indian Railways: ట్రైన్ లోకోమోటివ్‌ దోషిగా తేలడమేంటి? దాన్ని అరెస్టు చేయడమేంటి? అసలు ఈ కేసేంటి? ఎవరిని ఎవరు హత్య చేశారు? ఎలా జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 21, 2020, 12:31 PM IST
Indian Railways: హత్యల కేసులో దోషిగా తేలిన ట్రైన్ ఇంజిన్... అరెస్టు, సీజ్ చేసిన అధికారులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Indian Railways: భారతీయ రైల్వే చరిత్రలోనే బహుశా ఇలాంటి ఘటన ఇంతకు ముందెప్పుడూ జరిగి ఉండదు. అసోం ఫారెస్ట్ విభాగం అధికారులు... ఓ రైలు ఇంజిన్‌ని అరెస్టు చేసి... సీజ్ చేశారు. ఎందుకూ... అంటే... అది గత నెలలో ఓ ఏనుగూ, దాని గున్న ఏనుగు (పిల్ల ఏనుగు)ను చంపేసిందట. ఈ కేసుపై రైడింగే చేసేందుకు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ దాస్... సోమవారం... గౌహతిలోని బామునిమైదాన్ రైల్వే యార్డుకు వెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహనాల్ని సీజ్ చేసినట్లుగా... ఫారెస్ట్ అధికారులు... లోకోమోటివ్ (రైలు ఇంజిన్)ను సీజ్ చేశారు. ఏనుగులు చనిపోయిన ప్రమాద ఘటన... లండింగ్ డివిజన్ ఫారెస్ట్ అధికారుల పరిధిలోని ప్రాంతంలో... సెప్టెంబర్ 27న జరిగింది. గూడ్స్ రైలు వెళ్తుండగా... ఏనుగు, దాని పిల్ల... పట్టాలు దాటసాగాయి. ఐతే... గూడ్స్ చాలా వేగంగా వచ్చింది. దాని వేగానికి... తల్లి ఏనుగు అక్కడికక్కడే చనిపోగా... పిల్ల ఏనుగును... కిలోమీటర్ వరకూ ఈడ్చుకుపోయింది రైలు ఇంజిన్. ఈ ఘటనలో... రైలు పైలట్, కోపైలట్ ఇద్దర్నీ... రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.

"వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం... ఏనుగు అనేది... షెడ్యూల్ 1లో ఉన్న వన్యప్రాణి. మేం వాటిని పూజిస్తాం. రిజర్వ్ ఫారెస్టులో వెళ్లేటప్పుడు రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. ప్రమాదం జరిగినప్పుడు రైలు వేగం గంటకు 60 కిలోమీటర్లు ఉందని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది" అని రాజీవ్ దాస్ తెలిపారు. "పోలీసులు కత్తులు, పిస్టళ్లను ఎలాగైతే సీజ్ చేస్తారో... అలా మేం రైలు ఇంజిన్ ని సీజ్ చేశాం. ఎందుకంటే ఈ ఘటనతో రైలు ఇంజిన్ కి కూడా సంబంధం ఉంది." అని దాస్ తెలిపారు.

ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుభనన్ చంద్ర దీనిపై స్పందించారు. "ఆ ఇంజిన్‌ని రిలీజ్ చేయించాం. కానీ రైళ్లు ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నాయన్నది నిజం" అన్నారు. "సీజ్ అంటే... వాళ్లు ఆ రైలు ఇంజిన్ ని తమతో పట్టుకెళ్లలేదు. అది అక్కడే ఉంది. దాన్ని సీజ్ చేసినట్లుగా రిపోర్టులో రాశారు. అందువల్ల దాన్ని మేం వాడే ఛాన్స్ ఉండదు. ఐతే... మేం దాన్ని విడిపించాం. కాబట్టి ఇప్పుడు మళ్లీ దాన్ని వాడుతున్నాం" అని చంద్ర వివరించారు.

మొత్తానికి ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైలు ఇంజిన్ దోషేంటి, అరెస్టు, సీజ్ ఏంటి అని అంతా వివరాలు తెలుసుకుంటున్నారు. తద్వారా అసోంలో ఏటా ఎలా ఏనుగులు రైళ్ల వల్ల చనిపోతున్నదీ చర్చకు వస్తోంది. గతేడాది ఆ రాష్ట్రంలో రైళ్లు గుద్దడం వల్ల 80 ఏనుగులు చనిపోయాయి. అలాగే 100 మంది మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రైల్వే అధికారులు... అసోంలో తిరిగే రైళ్ల వేగాన్ని తగ్గించడం మొదలుపెట్టారు.
Published by: Krishna Kumar N
First published: October 21, 2020, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading