ASSAM FLOODS PATIENTS GET TREATMENT ON ROAD AS HOSPITALS SUBMERGE PVN
Treatment On Roads : నీట మునిగిన హాస్పిటల్స్..రోడ్లపైనే పేషెంట్లకు ట్రీట్మెంట్
రోడ్డపైనే పేషెంట్స్ కు ట్రీట్మెంట్
Assam Floods : అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అస్సాం చిగురుటాకులా వణికిపోతుంది. ఇప్పటికే అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి పైగా ఈ వరదలతో ప్రభావితం అయ్యారు.
Assam Floods : అసోంలో వరదలు(Assam Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అసోం చిగురుటాకులా వణికిపోతుంది. ఇప్పటికే అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి పైగా ఈ వరదలతో ప్రభావితం అయ్యారు. ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇతర ఏజెన్సీలు వరద నీటిలో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు సహాయక చర్యలను కొనసాగిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా లక్షలాది సంఖ్యలో ప్రజలు అక్కడ నిరాశ్రయులయ్యారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వదరల వల్ల రాష్ట్రంలో ఇప్పటి వరకు 126 మరణాలు(Deaths) సంభవించాయి. వీటికితోడు రోజువారీ జీవితం భారంగా మారింది. విద్యుత్ సహా అన్ని సదుపాయాలు నిలిచిపోయాయి. రోజు గడవడమే కష్టంగా ఉంది. రాష్ట్రంలోని ఆసుపత్రులు(Hospitals).. రోడ్డుపైనే రోగులకు ట్రీట్మెంట్(Treatment) అందించాల్సిన పరిస్థితి. కాచార్ జిల్లాలోని సిల్చార్ టౌన్ లో పరిస్థితి దారుణంగా ఉంది. స్థానిక బరాక్ నది పొంగడం వల్ల సిల్చార్ పట్టణం(Silchar Town) నీట మునిగింది. వీధులన్నీ చెరువుల్లా మారాయి. అక్కడి ఆస్పత్రులు కూడా నీట మునిగిపోయాయి. దాంతో హాస్పిటల్ సిబ్బంది పేషెంట్స్ ను బయటకు తీసుకొచ్చి నీళ్లు లేని చోట కూర్చోబెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
సిల్చార్ లోని 150 పడకల క్యాచర్ క్యాన్సర్ హాస్పిటల్ పాటు రీసెర్చ్ సెంటర్ కూడా నీట మునిగిపోయాయి. గదులన్నీ నీళ్లతో నిండిపోయి పరిస్థితి చాలా భయంకరంగా మారింది. లైఫ్ జాకెట్లను, బోట్లను ఉపయోగించి హాస్పిటల్ లోని సిబ్బందిని, రోగులను బయటకు తరలించాయి సహాయక బృందాలు. ఆ తర్వాత హాస్పిటల్ సిబ్బంది నీళ్లు లేని చోటకు రోగులను తీసుకెళ్లి... కీమో థెరపీ చేస్తున్నారు. హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతూ..."ఎవరికైనా అత్యవసర శస్త్ర చికిత్స అవసరమైతే చేస్తున్నాం. అనస్థియాకు అవసరమైన నైట్రస్ గ్యాస్ కొరత ఉంది. దీంతో ఆపరేషన్‌లు తగ్గించాం"అని తెలిపారు. వరదల రాక ముందు చాలా రోగులు హాస్పిటల్ లో చేరారని ఇప్పుడు వారిని జాగ్రత్తగా సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను కోరుతున్నారు డాక్టర్లు. ఈ క్రమంలో రోగులకు చికిత్స ఆగిపోకుండా చూసుకుంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు.
వరదల నేపథ్యంలో ఆదివారం అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సిల్చార్ లో పర్యటించారు. పడవలో సీఎం సిల్చార్ లో పర్యటిస్తుండగా ఆయనను అనేక మంది తమ బాధలను చెప్పుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అప్రమత్తమయ్యారని సహాయ చర్యలను ముమ్మరం చేశారని సీఎం తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.