Home /News /national /

ASSAM FLOODS NEARLY 57000 PEOPLE ACROSS 7 DISTRICTS IMPACTED THREE DEATHS REPORTED PAH

Heavy rain: వరద బీభత్సం.. విరిగిపడిన కొండ చరియలు.. ముగ్గురు మృతి..

అస్సాంలో వరదలు

అస్సాంలో వరదలు

Assam Floods: అస్సాంలో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

అస్సాం రాష్ట్రంలో వ‌రద (Assam floods) బీభత్సం కొన‌సాగుతోంది. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరదల ధాటికి సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రెండు రోజులుగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం కూడా అస్సాంలో (Heavy rain)  భారీ వర్షపాతం నమోదైంది. అధిక వ‌ర్షాల వ‌ల్ల కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.

అక్కడ వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరదల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు వ్య‌క్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారంతా కచార్ జిల్లాలోనే చెందిన వారిగా తెలుస్తోంది. ప్ర‌స్తుత వ‌ర‌ద‌ల వ‌ల్ల ముఖ్యంగా కచార్, ధేమాజీ, హోజాయ్, కర్బి ఆంగ్లాంగ్ వెస్ట్, కామరూప్ (ఎం), నాగావ్, నల్బరి ప్రాంతాలు ప్ర‌భావానికి గుర‌వుతున్నాయి. దాదాపు 57 వేల మంది వరద ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది.





అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 222 గ్రామాలు ప్రభావితమయ్యాయి. కాచర్ లో 138 గ్రామాలు, ధేమాజీ లో 2 గ్రామాలు, హోజై 34, కర్బి ఆంగ్లాంగ్ వెస్ట్ 5, నాగావ్ లో 39, నల్బరిలో 4 గ్రామాలు ముంపున‌కు గుర‌య్యాయి. ఈ గ్రామాల్లో నివసించే బాధిత ప్రజలకు సహాయం చేయడానికి, అస్సాం ప్రభుత్వం సహాయ శిబిరాలు, సహాయ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. న్యూ కున్‌జుంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయి, నమ్‌జురాంగ్, సౌత్ బాగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్ మరియు లోడి పాంగ్‌మౌల్ గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

కొండ చరియలు విరిగిపడటంతో జతింగా-హరంగాజావో, మహుర్-ఫైడింగ్ వద్ద రైల్వే లైన్ బ్లాక్ అయినట్లు ASDMA పేర్కొంది. గెరెమ్లాంబ్రా గ్రామం వద్ద మైబాంగ్ సొరంగాన్ని కలిపే రహదారి కూడా మూసుకుపోయే ప్రమాదం ఉంది. కాగా, ఇప్పటికే కేంద్ర అప్రమత్తమైంది. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అందించేందుకు ప్ర‌భుత్వం ఇండియ‌న్ ఆర్మీ, పారామిలటరీ దళాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు శిక్షణ పొందిన వాలంటీర్లను నియ‌మించింది. కచార్, ధేమాజీ, మోరిగావ్ కరీంగంజ్, నాగావ్ జిల్లాలకు ఏఎస్డీఎంఏ వరద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు తమ ఇంట్లోనే సురకితంగా ఉండాలని, అనవసరంగా బైటకు రావద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Assam, Floods, Heavy Rains

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు