• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • ASSAM EARTHQUAKE NETIZENS SHARED PHOTOS VIDEOS TO SHOW SCALE OF DESTRUCTION AFTER 6 4 MAGNITUDE EARTH QUAKE SK

Assam Earthquake: అసోంలో భూకంప విధ్వంసాన్ని కళ్లకు కట్టే దృశ్యాలు

అసోంలో భూకంపం

Assam Earthquake: హిమాలయ పర్వతాల్లో చిన్న చిన్న భూకంపాలు రావడం సహజమే. కానీ 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది.

  • Share this:
    అసోంలోను భారీ భూకంపం వణికించింది. బుధవారం ఉదయం 07.51కు భూకంఫం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. అసోంలోని సోనిత్‌పూర్‌లో భూకంపకేంద్రం ఉన్నప్పటికీ.. గువహటిలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ కొన్ని భవనాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. గోడలు కూలిపోయాయి. లగ్జరీ హోటల్ తాజ్ వివాంటలో ఫాల్స సీలింగ్ పడిపోయింది. అసోంలో 6.0 తీవ్రతతో అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. వందల కిలోమీటర్ల వరకు ప్రకపంనలు వచ్చినట్లు తెలిపింది.

    అసోంలోని భూకంప బీభత్స దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.






    హిమాలయ పర్వతాల్లో చిన్న చిన్న భూకంపాలు రావడం సహజమే. కానీ 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. 1950లో అసోం, టిబెట్‌లో వచ్చిన భారీ భూకంపం ధాటికి 4,800 మంది మరణించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: