Home /News /national /

ASSAM EARTHQUAKE 6 4 MAGNITUDE EARTH QUAKE AND TWO AFTERSHOCKS JOLT ASSAM STATE TREMORS FELT IN NORTHEAST AND NORTH BENGAL NK

Earthquake: అసోంలో భారీ భూకంపం... బెంగాల్‌‌ లోనూ ప్రకంపనలు... తీవ్రత ఎంతంటే

అసోంలో భారీ భూకంపం (image credit - twitter)

అసోంలో భారీ భూకంపం (image credit - twitter)

Assam Earthquake: దట్టమైన పర్వతాలతో ఉండే అసోంలో భూకంపం రావడం ఆందోళన కలిగించే అంశమే. అందులోనూ భారీ భూకంపం. ఎందుకు వచ్చింది? అక్కడ ఏం జరుగుతోంది?

    Earthquake in Assam: ఈశాన్య రాష్ట్రమైన అసోంను భారీ భూకంపం ఈ ఉదయం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.4గా నమోదైంది. అసోంలోని తేజ్‌పూర్‌ నుంచి ఈ భూకంపం మొదలైంది. భూ ప్రకంపనలు అసోంతోపాటూ... ఉత్తర బెంగాల్, ఈశాన్య ప్రాంతంలో కూడా వచ్చాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం... భూకంప తీవ్రత 6.4 అని చెబుతున్నా... దాని ప్రభావం ఎక్కువగానే ఉందంటున్నారు. రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7.51కి భూమి కంపించింది. తేజ్‌పూర్‌లో భూమి లోపల 43 కిలోమీటర్ల లోతున భూకంపం ఏర్పడింది. ఆ తర్వాత రెండుసార్లు ప్రకంపనలు వచ్చాయి. మొదటిది 7.55కి వచ్చింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే రెండోసారి కూడా భూమి ప్రకంపించింది. వాటి తీవ్రతను చూస్తే మొదటిది రిక్టర్ స్కేలుపై 4.3 ఉండగా... రెండోది 4.4 ఉంది. ఆ తర్వాత మరో రెండుసార్లు ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది.








    ఈ భూకంపం రావడాన్ని అసోం, ఉత్తర బెంగాల్ అనుభూతి చెందారు. ప్రకంపనలు కనీస 30 సెకండ్లపాటూ వచ్చాయనీ... ఆ సమయంలో తమ ఇళ్లు కదిలాయని వారు చెబుతున్నారు.





    వివిధ ప్రాంతాల్లో భూకంపం తీవ్రత


    అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం... ఈ భూకంపం భూమి లోపల 29 కిలోమీటర్ల లోతులో వచ్చింది. అసోంలో ఇంత పెద్ద భూకంపం ఎప్పుడూ రాలేదు.




    ఇది కూడా చదవండి: Mutual Fund: రోజూ రూ.167 సేవ్ చెయ్యండి... బిలియనీర్ అవ్వండి... పూర్తి వివరాలు

    భూకంపం తర్వాత ప్రజలు, ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిలో గోడలు కూలినట్లు, కిటికీలు పగిలినట్లు దృశ్యాలు ఉన్నాయి. ఇళ్ల పగుళ్లు కూడా కనిపిస్తన్నాయి. ఐతే... ఎవరూ చనిపోలేదనీ, గాయపడలేదని తెలుస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Assam, Earthquake, Upper Assam Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు