Home /News /national /

ASSAM COP JUNMONI RABHA WHO ARRESTED FIANCE FOR FRAUD NOW ARRESTED HERSELF PVN

Woman Cop Arrest : కాబోయే భర్తను అరెస్ట్ చేసి సంచలనంగా మారిన మహిళా పోలీస్ అరెస్ట్

ఎస్సై జున్మోని రాభా అరెస్ట్

ఎస్సై జున్మోని రాభా అరెస్ట్

Assam Woman Cop Arrest : గత నెల ప్రారంభంలో అసోంలో ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ కాబోయే భర్తను అరెస్ట్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పోలీస్ అధికారిణి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎస్సై జున్మోని రాభాని శనివారం(జూన్ 4)పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇంకా చదవండి ...
Assam Woman Cop Arrest : గత నెల ప్రారంభంలో అసోంలో ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ కాబోయే భర్తను అరెస్ట్ చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. రాణా పోగాగ్ (Rana Pogag) అనే వ్యక్తి తాను స్థానికంగా పబ్లిక్ రిలేషన్ (Public relation officer) అధికారినంటూ అక్కడి అధికారులతో, స్థానికులతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మజులి జిల్లాలో (SI in Majuli district) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జున్మోని రాభా (Junmoni Rabha) తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు పెద్దల అంగీకారంతో గత ఏడాది అక్టోబరులో ఎంగెజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది నవంబర్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కాబోయే భర్త గురించి పలు షాకింగ్ విషయాలు వెలుగులోనికి వచ్చాయి.

కొంత మంది వ్యక్తులు రాణా పోగాగ్ చేస్తున్న మోసాలకు గురించి ఆమెకు ఫిర్యాదు చేశారు. రాణాపోగాగ్ స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఆమె ఎదుట వాపోయారు. సదరు వ్యక్తి తనకు.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) (ONGC) లో తెలిసిన వారు ఉన్నారని చెప్పి.. కోట్ల రూపాయలు తీసుకొని, నకిలీ నియామక పత్రాలు (Fake Offer letters) ఇచ్చారని ఆరోపించారు. దీంతో ఆమెకు కాబోయే భర్త బాగోతాలు వెలుగులోనికి వచ్చాయి. దీంతో ఆమె షాకింగ్ కు గురైంది. వెంటనే అతగాడిని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. కాగా, ఫిర్యాదు చేసిన వారికి ఆమె ధన్యవాదాలు కూడా తెలిపారు. తనకు కాబోయే భర్త విషయాలు బాగోతాలు చెప్పిన వ్యక్తులకు, తన జీవితాన్ని కాపాడారని ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ Son met mother after 27 years: 14 ఏళ్ల వయస్సులో తప్పిపోయి..27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు!

అయితే ఇప్పుడు ఆ పోలీస్ అధికారిణి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎస్సై జున్మోని రాభాని శనివారం(జూన్ 4)పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజులు ఇంటరాగేషన్ తర్వాత స్సై జున్మోని రాభాని అరెస్ట్ చేశారు. అయితే ఆమె అరెస్ట్ పై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఎస్సై జున్మోని రాభా...అరెస్ట్ కాబడ్డ తన ప్రియుడితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు రాగా, జున్మోని రాభాకి వ్యతిరేకంగా తమకు కొన్ని ఆధారాలు లభించాయని మజులి జిల్లా ఎస్పీ గౌతమ్ నోరా తెలిపారు. అరెస్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను తాము ఇప్పుడు బయటపెట్టాలనుకోవట్లేదని తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Assam, Police arrest

తదుపరి వార్తలు