ఫ్లూటు గోవు ముందు ఊదు...పాలు బాగా ఇస్తాయి...బీజేపీ ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

రైతులు తమ పశువులకు పిల్లనగ్రోవి ఊది సంగీతం వినిపిస్తే అవి మైమరిచిపోయి పాల ఎక్కువగా ఇస్తాయన్నారు. అంతే కాదు ఇదంతా సైంటిఫిక్ గా సైతం ప్రూవ్ అయ్యిందని ఆయన వాదిస్తున్నారు.

  • Share this:
    శ్రీకృష్ణుడి వేణుగానానికి పశువులు ఆనందంతో పరుగులెత్తుకుంటూ వచ్చి వినేవని, అలాగే అవి పితకకుండానే పాలు ఇచ్చేవని పురాణ కాలక్షేపాల్లో చెబుతుంటారు. అయితే ఇవన్నీ ఈ ఆధునిక యుగంలో సైతం పురాణాల్లో మాదిరిగానే వేణుగానం వినిపిస్తే ఇప్పటి ఆవులు, గేదెలు సైతం పాలు అధికంగా ఇస్తాయని బీజేపీ ఎమ్మెల్యే దిలీప్ కుమార్ పాల్ సెలవిచ్చారు. రైతులు తమ పశువులకు పిల్లనగ్రోవి ఊది సంగీతం వినిపిస్తే అవి మైమరిచిపోయి పాల ఎక్కువగా ఇస్తాయన్నారు. అంతే కాదు ఇదంతా సైంటిఫిక్ గా సైతం ప్రూవ్ అయ్యిందని ఆయన వాదిస్తున్నారు. అయితే తాను చెప్పేది కల్లబొల్లి కబుర్లు కావని, గుజరాత్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ పరిశోధన చేసి ఈ విషయం బయటపెట్టిందని ఆయన అన్నారు.
    First published: