Assam-meghalaya border dispute resolves : 5 దశాబ్దాలుగా అసోం-మేఘాలయ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి తెరపడింది. మొత్తం 12 లొకేషన్స్ లో రెండు ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలుండగా.. 6 లొకేషన్స్ లో వివాద పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకారానికి వచ్చారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర హోం వ్యవహారాల శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఆరు ప్లేస్ లలో(36.79 స్క్వేయర్ కిలోమీటర్ల ఏరియా) మొత్తం 36 గ్రామాలుండగా..తాజా పరిణమాంతో సమస్య పరిష్కారమయింది. అసోంకి 18.51 స్వేయర్ కిలోమీటర్లపై పూర్తి కంట్రోల్ రానుండగా..మేఘాలయకి 18.28 స్వేయర్ కిలోమీటర్లపై కంట్రోల్ రానుంది. సరిహద్దు వివాదాల పరిష్కరానికి అసోం-మేఘాలయ రాష్ట్రాలు ఒక్కొక్కటి గతేడాది ఆగస్టులో మూడు కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య రెండు సార్లు చర్చలు కూడా జరిగాయి.ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యకు ముగింపు పలికేందుకు ఓ ముసాయిదా తీర్మానాన్ని కూడా రూపొందించారు.
#WATCH Assam CM Himanta Biswa Sarma and Meghalaya CM Conrad K Sangma sign an agreement to resolve the 50-year-old pending boundary dispute between their states, in the presence of Union Home Minister Amit Shah in Delhi pic.twitter.com/hnP6hs8yMm
— ANI (@ANI) March 29, 2022
ఈశాన్య భారత్ లో ఇదో చారిత్రకమైన రోజు అని అమిత్ షా అన్నారు. 50ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసినందుకు రెండు రాష్ట్రాల సీఎంలకు ఈ సందర్భంగా అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. ఒప్పందంపై సంతకాల ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య దాదాపుగా 70 శాతం సమస్య పరిష్కారమైందని వివరించారు. ఇక.. మిగతా 6 లొకేషన్స్ లో వివాదంపై కూడా త్వరలోనే ఓ అంగీకారం కుదురుతుందని ప్రకటించారు.ఇదో చారిత్రకమైన రోజు అని అసోం సీఎం హిమంత విశ్వ శర్మ అభివర్ణించారు. మిగతా వివాదాలను కూడా త్వరలోనే పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తాము తమ రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని సీఎం హిమంత విశ్వ శర్మ అన్నారు.
సరిహద్దు సమస్యను పరిష్కరించడంలో తగిన సూచనలిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమ రాష్ట్రం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా ప్రకటించారు. ప్రస్తుతం మొదటి దశ తీర్మానాలు జరిగాయన్నారు. ఇక,ఈ కమిటీలో కీలక పాత్ర పోషించిన అధికారులకు, అసోం ముఖ్యమంత్రి హిమంతకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన వివాదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని సీఎం కోన్రాడ్ సంగ్మా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.