Ashok Lavasa | ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాజీనామా

Election Commissioner Resign | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా మీద వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు ఈసీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని అశోక్ లావాసా విబేధించారు.

news18-telugu
Updated: August 18, 2020, 6:45 PM IST
Ashok Lavasa | ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాజీనామా
అశోక్ లావాసా (File)
  • Share this:
Ashok Lavasa Resignation | కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ తర్వాత రేసులో ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు అందజేశారు. అశోక్ లావాసా ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకే కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. గత నెలలోనే అశోక్ లావాసాను వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. తనను ఆగస్టు 31లోపు విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను తన రాజీనామా లేఖలో అశోక్ లావాసా కోరారు. అయితే, రాష్ట్రపతి కోవింద్ ఆ రాజీనామాను ఆమోదించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ‘అశోక్ లావాసాకు పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్‌, మౌలిక సదుపాయాల అభివృద్దిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత నిపుణత, అనుభవం ఉన్నాయి. పబ్లిక్ పాలసీలు, ప్రైవేట్ సెక్టార్ మీద ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది.’ అంటూ అశోక్ లావాసా అపాయింట్‌మెంట్‌ లేఖలో ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ పేర్కొంది.

భారత ఎన్నికల సంఘంలో అశోక్ లావాసాకు ఇంకా రెండు సంవత్సరాల సర్వీసు ఉంది. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా తర్వాత ఆయనే రేస్‌లో ఉన్నారు. ఇప్పుడు అశోక్ లావాసా తన పదవికి రాజీనామా చేసి ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు వెళ్లిపోతే సునీల్ చంద్రా తర్వాత స్థానంలో నిలుస్తారు. ప్రస్తుతం ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న దివాకర్ గుప్తా నుంచి అశోక్ లావాసా బాధ్యతలను స్వీకరిస్తారు. గుప్తా పదవీకాలం ఆగస్టు 31తో ముగుస్తుంది.

అశోక్ లావాసా హర్యానాకు చెందిన 1980 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ కేడర్ అధికారి. ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. 2018 సంవత్సరంలో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా చేరారు. అంతకు ముందు ఆయన పర్యావరణం, పౌరవిమానయాన శాఖ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. 2001-02 సంవత్సరంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫైర్స్‌లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కు సంబంధించిన అంశాలను ఆయనే చూసేవారు.

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన పేరు ఒక్కసారి తెరపైకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ 11 ఫిర్యాదులు రాగా, వాటిని ఈసీ తోసిపుచ్చింది. వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, ఈసీ వైఖరిని స్వయంగా ఎన్నికల కమిషనర్ అయిన అశోక్ లావాసా తప్పుపట్టారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అశోక్ లావాసా భార్య నోవల్ సింఘాల్ ఆదాయానికి సంబంధించి ఇన్ కం ట్యాక్స్ శాఖ నోటీసులు ఇచ్చింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 18, 2020, 6:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading