AIMIM Twitter account hacked: అసదుద్దీన్ ఒవైసీకి షాకిచ్చిన హ్యాకర్లు.. AIMIM పార్టీ ట్విట్టర్‌ అకౌంట్ హ్యాక్.. ఏం చేశారంటే..

(Image-Twitter)

ఎంఐఎం పార్టీని హ్యాక్లర్లు టార్గెట్ చేశారు. ఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాక్ చేసిన దుండగులు.. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి షాకిచ్చారు.

  • Share this:
    ఎంఐఎం పార్టీని హ్యాక్లర్లు టార్గెట్ చేశారు. ఎంఐఎం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాక్ చేసిన దుండగులు.. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి షాకిచ్చారు. ట్విట్టర్‌లో చెలరేగిన పోయిన హ్యాకర్లు.. ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చేశారు. తమ పార్టీ ట్విట్టర్ అకౌంట్ @aimim_national హ్యాక్ అయినట్టు ఎంఐఎం పార్టీ తెలిపింది. ఈ అకౌంట్‌లో తాము పార్టీకి సంబంధించిన పోస్టులు, పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఇతర నాయకులు కార్యక్రమాలను పోస్ట్ చేస్తుంటామని పేర్కొంది. అయితే ఎంఐఎం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసి.. ప్రొఫైల్ ఫొటో వద్ద టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్‌ మస్క్‌ ఉంచారు. అలాగే డిస్‌ప్లే నేమ్‌ను ‘Ꭼꮮꮻɴ Ꮇꮜꮪꮶ’ గా మార్చారు.

    ఆదివారం మధ్యాహ్నం సమయంలో హ్యాకర్లు ఈ పనిచేసినట్టుగా తెలుస్తోంది. తొలుత అకౌంట్‌ను హ్యాక్ చేసి.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కొన్ని పోస్టులు, మీమ్స్ పోస్ట్ చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత అవి తొలగించబడ్డాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘తొమ్మిది రోజుల క్రితం కూడా AIMIM పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ చేయబడింది. ఇందుకు సంబంధించి మేము ట్విట్టర్‌తో సంప్రదింపులు జరిపాం. తర్వాత మా అకౌంట్ పునరుద్దరించబడింది’అని తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం రోజున హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

    ప్రస్తుతం అకౌంట్ హ్యాకింగ్ కావడంపై ట్విట్టర్‌కు సమాచారం ఇచ్చామని, అకౌంట్‌ను తిరిగి పునరుద్దరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంఐఎం పార్టీ వర్గాలు తెలిపాయి.
    Published by:Sumanth Kanukula
    First published: