ఈసీ నిరాశ పరిచిందా... యావరేజ్ మార్క్స్ వేసిన చిదంబరం

పి.చిదంబరం

Lok Sabha Elections Exit Polls 2019 : ఏడో దశ పోలింగ్ కూడా అయిపోవడంతో... ఈసీ పనితీరుపై నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. మరి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఏం చెప్పారు?

  • Share this:
ఏదైనా అంశాన్ని విశ్లేషించడంలో తనదైన ఆలోచనలకు పదును పెడుతుంటారు స్వతహాగా లాయరైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. ఈసారి 10 వారాలపాటూ... ఏకంగా ఏడు దశల్లో సాగిన ఎన్నికలకు మే 19 ముగింపు పలుకుతోంది. ఈ పది వారాల్లో మనం నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు, బూతులు, కొట్టుకోవడాలూ, తిట్టుకోవడాలూ అన్నీ చూశాం ఒక్క ప్రభుత్వ పాలనపై అర్థవంతమైన చర్చలు తప్ప. రాజకీయ పార్టీల నేతలు... ర్యాలీలు, రోడ్ షోలతో అదరగొట్టారు. వేల కోట్ల రూపాయల మనీ ప్రవాహం సాగింది. చాలా చోట్ల హింస చెలరేగింది. టీడీపీ సహా 23 పార్టీలు ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై జాతీయస్థాయిలో ఉద్యమమే మొదలుపెట్టాయి. మొత్తానికి భారీ క్రతువు పూర్తైంది.

ఈసీ పనితీరుపై విశ్లేషించిన చిదంబరం యావరేజ్ మార్క్స్ ఇచ్చారు. వేర్వేరు రాష్ట్రాలకు ఈసీ వేర్వేరు రూల్స్ అమలుచేసిందని విమర్శించారు. తమిళనాడులో రోడ్డు షోలు, కార్ల కాన్వాయ్‌లు, హోర్డింగులు పెట్టకూడదని నిషేధించింది. నగరాలు, పట్టణాల్లో పోస్టర్లు, గోడలపై రాతల్ని కూడా బ్యాన్ చేసింది. ఐతే... ఢిల్లీలో ఎక్కడ చూసినా... హోర్డింగులు, పోస్టర్లూ కనిపించాయి. రోడ్డు షోలు, పొడవాటి కాన్వాయ్‌లకు లెక్కలేదు. నగదు ప్రవాహం జోరుగా సాగినా, అబ్జెర్వర్లే లేరని చిదంబరం విమర్శించారు. తన చర్యల్ని ఈసీ ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు చిద్దూ.

మీడియా కూడా భయంతోనో, ప్రేమతోనో బీజేపీవైపు టర్న్ అయ్యిందని ఆరోపించారు చిదంబరం. ఆన్‌లైన్ మీడియా, సోషల్ మీడియా మాత్రం వాస్తవాల్ని ప్రతిబింబించాయన్నారాయన. బీజేపీ నేతలు మేనిఫెస్టో గురించి ఏమీ మాట్లాడలేదనీ... కాంగ్రెస్ మాత్రం తమ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలపై ప్రచారం చేసిందన్నారు.

 

ఇవి కూడా చదవండి :

కూర బాలేదన్న భర్త... సూసైడ్ చేసుకున్న భార్య...

లగడపాటి సర్వే... లాజిక్ మిస్సైందా... టీడీపీ, వైసీపీకి తగ్గితే... జనసేనకు పెరగలేదేం..?

వైసీపీకి 120... రోజా ఓటమి... ఆ సంస్థ సర్వేలో అంచనాలు ఇవీ...

A=B B=C... A=C... లగడపాటి సర్వేపై ప్రొ.నాగేశ్వర్ ఆసక్తికర కామెంట్స్...

లోక్ సభ స్థానాలపై చంద్రబాబు రిపోర్ట్... టీడీపీకి ఎన్ని? వైసీపీకి ఎన్ని?
First published: