దిగొచ్చిన మమత...డాక్టర్ల డిమాండ్లను అంగీకరిస్తామని హామీ

తనపై ప్రజాస్వామ్యంపై గౌరవం ఎక్కువని..అందుకే ఎస్మాను ప్రయోగించలేదని స్పష్టంచేశారు. ఏ ఒక్క డాక్టర్‌పై చర్యలు తీసుకోబోమన్నారు మమతా బెనర్జీ.

news18-telugu
Updated: June 15, 2019, 7:16 PM IST
దిగొచ్చిన మమత...డాక్టర్ల డిమాండ్లను అంగీకరిస్తామని హామీ
మమతా బెనర్జీ
  • Share this:
డాక్టర్ల సమ్మె నేపథ్యంలో బెంగాల్‌లో వైద్యసేవలు స్తంభించడంతో సీఎం మమతా బెనర్జీ దిగొచ్చారు. వైద్యుల న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరిస్తున్నామని..వెంటనే సమ్మెను విరమించాలని విజ్ఞప్తిచేశారు. డాక్టర్ల సమ్మెతో వేలాది మంది రోగులు నరకయాతన అనుభవిస్తున్నారని చెప్పారు. తనపై ప్రజాస్వామ్యంపై గౌరవం ఎక్కువని..అందుకే ఎస్మాను ప్రయోగించలేదని స్పష్టంచేశారు. ఏ ఒక్క డాక్టర్‌పై చర్యలు తీసుకోబోమన్నారు మమతా బెనర్జీ.

డాక్టర్లు నిరసనలు చేపట్టిన రోజే వారితో మాట్లాడాలని అనుకున్నా. కానీ నాతో మాట్లాడేందుకు వైద్యులు నిరాకరించారు. డాక్టర్లు మా టార్గెట్ కాదు. కానీ డాక్టర్లు మాత్రం ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఏదేమైనా సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల డిమాండ్లను అంగీకరిస్తున్నాం. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరండి.
మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం


కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడిని నిరసిస్తూ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దాంతో నాలుగు రోజులుగా బెంగాల్‌ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. మరోవైపు ఈనెల 17వ తేదీన దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ఐఎంఏ స్పష్టంచేసింది. ఈ క్రమంలో దిగొచ్చిన బెంగాల్ ప్రభుత్వం డాక్టర్ల డిమాండ్లకు అంగీకరించింది.
First published: June 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>