Home /News /national /

AS PM MODI VISITS AZADI 75 EXPO IN LUCKNOW THE DETAINED PRIYANKA GANDHI SHARES LAKHIMPUR KHERI LATEST VIDEO MKS

UP violence: లక్నోలో ప్రధాని మోదీ ‘ఆజాదీ’ వేడుక -పక్కనే ప్రియాంక నిర్బంధం -ఒళ్లు గగుర్పొడిచే వీడియో

లక్నోలో మోదీ, సీతాపూర్ లో ప్రియాంక

లక్నోలో మోదీ, సీతాపూర్ లో ప్రియాంక

Priyanka Gandhi on PM Modi over Lakhimpur violence | రైతులపై హత్యాకాండకు పాల్పడిన బీజేపీ నేతల్ని స్వేచ్ఛగా వదిలేసి, బాధితులను పరామర్శించడానికి వచ్చిన తనను నిర్బంధించారేమిటంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ నేరుగా ప్రధాని మోదీని సవాలు చేశారు. ఆజాదీకా అమృతోత్సవ్(75ఏళ్ల స్వాతంత్ర్య వేడుక)లో భాగంగా ప్రధాని ఇవాళ యూపీ రాజధాని లక్నోలో కీలక కార్యక్రమాలు తలపెట్టారు..

ఇంకా చదవండి ...
రైతులపై హింసాకాండ ఘటన తర్వాత అట్టుడుకుతోన్న ఉత్తరప్రదేశ్ లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ  పర్యటించారు. లఖీంపూర్ ఖేరీ జిల్లా కేంద్రానికి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో, యూపీ రాజధాని లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల మరణాలకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలంటూ మూడు రోజులుగా ఉద్యమిస్తోన్న విపక్షాలు.. ప్రధాని రాక సందర్భంగా ఆందోళనలన్ని ఉధృతం చేశాయి..

ప్రధాని మోదీ ఇవాళ లక్నోలో జరిగిన ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొన్నారు. యూపీలో 74 అర్బన్ డవలప్‌మెంట్ ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. కాగా, ప్రధాని లక్నో పర్యటను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కొద్ది గంటల కిందట కీలక వీడియోను పోస్ట్ చేశారు..


లఖీంపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తనను గత 28 గంటలుగా నిర్బంధంలో ఉంచినట్టు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారంనాడు తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు కానీ, ఎఫ్ఐఆర్ కానీ లేకుండా తనను నిర్బంధించినట్టు ఆమె తెలిపారు. నలుగురు రైతులతో సహా 8 మంది మృతికి కారణమైన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రధాని మోదీని సంబోధిస్తూ ప్రియాంక గాంధీ ఓ ట్వీట్ చేశారు. లక్నో, లఖీంపూర్ మధ్య ఉన్న సీతాపూర్ పట్టణంలోని ఓ గెస్ట్ హౌజ్ లో ప్రియాంకను పోలీసులు నిర్బంధించి ఉంచారు.

ప్రధాని మోదీ లక్నో పర్యటన తర్వాత ప్రియాంక సహా విపక్ష నేతలను పోలీసులు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిమిత సంఖ్యలో వెళ్లి బాధితులను పరామర్శించేలా పోలీసులు అవకాశం కల్పించొచ్చని తెలుస్తోంది. ఇప్పటికి 30 గంటలుగా నిర్బంధంలో ఉన్న ప్రియాంక తీరును ప్రశంసిస్తూ ఇదే నిజమైన కాంగ్రెసిజమని కొనియాడారు. మరోవైపు,

లఖీంపూర్ ఖేరీలో రైతులపై మారణకాండ జరిగితే, పక్కనే ఉన్న లక్నోలో ప్రధాని మోదీ వేడుకలో పాల్గొనడాన్ని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా తప్పు పట్టారు. లఖీంపూర్ హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్ విషాదంలో మునిగిపోయిందని, ఇది సెలబ్రేషన్లు జరుపుకునే సమయం కాదని అఖిలేశ్ అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Congress, Farmers Protest, Pm modi, Priyanka Gandhi, Uttar pradesh

తదుపరి వార్తలు