న్యాయవ్యవస్థలో భారీగా జడ్జీ (Judges)ల బదిలీలకు రంగం సిద్ధమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఎన్వీ రమణ (N.V. Ramana) నేతృత్వంలోని సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం 14 హైకోర్టుల్లోని జడ్జీ (judges)ల బదిలీల (transfer)కు సిఫారసు చేసినట్లు తెలిసింది. కొలీజియం (Collegium) సిఫార్సుల మేరకు తెలంగాణా, అలహాబాద్, బొంబాయి, కలకత్తా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, మద్రాస్, ఒరిస్సా, పాట్నా, పంజాబ్ మరియు హర్యానా, రాజస్థాన్ హైకోర్టుల నుంచి న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్, పాట్నా, మధ్యప్రదేశ్, కలకత్తా, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ మరియు హర్యానా, రాజస్థాన్, ఒరిస్సా, తెలంగాణ, అలహాబాద్, జార్ఖండ్, మద్రాస్, ఉత్తరాఖండ్ , త్రిపురతో సహా వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులను బదిలీ చేయడానికి సిఫార్సులు చేసినట్లు తెలిసింది. ఇక ముఖ్యంగా తెలంగాణ (Telangana) నుంచి ఇద్దరు జడ్జీలు బదిలీ అవనుండగా, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు ఇద్దరు కొత్త జడ్జీలు (new Judges) రానున్నారు.
తెలంగాణకు ఒక్కరే..
కొలీజియం సిఫార్సుల మేరకు పలువురు హైకోర్టు చీఫ్ జస్టిస్ (High court chief judges)లు, హైకోర్టు జడ్జీ (high court judges) లను త్వరలో బదిలీ (Transfer) చేయనున్నారు. వీరిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ M.S.S. రామచంద్రరావు (Ramachandra Rao), జస్టిస్ అమర్‌నాథ్ గౌడ్ (Justice Amarnath goud) లను వరుసగా పంజాబ్ మరియు హర్యానా, త్రిపుర హైకోర్టులకు సిఫార్సు చేశారు. బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Ujjal Bhuyan)ను తెలంగాణకు సిఫార్సు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు ఇద్దరు కొత్త జడ్జీలు రానున్నారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ రవినాథ్ తిల్హారి (Ravinath Tilhari)ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సిఫార్సు చేశారు. పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అహ్సనుద్దీన్ అమానుల్లా (Ahsanuddin Amanullah) ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సూచించింది.
అలహాబాద్ నుంచి అత్యధికం..
ఇక మిగతా న్యాయమూర్తుల వివరాలు పరిశీలిస్తే.. అలహాబాద్ హైకోర్టు నుంచి అత్యధిక సంఖ్యలో బదిలీలు జరిగాయి. వారు మధ్యప్రదేశ్ హైకోర్టుకు జస్టిస్ వివేక్ అగర్వాల్, ఆంధ్రప్రదేశ్‌కు రవి నాథ్, ఢిల్లీ హైకోర్టుకు చంద్ర ధర సింగ్, యశ్వంత్ వర్మ, జార్ఖండ్ హైకోర్టుకు సుభాష్ చంద్ (అదనపు న్యాయమూర్తి) మరియు M.N. భండారిలను మద్రాస్ హైకోర్టుకు సిఫారసు చేశారు. ఇక పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. అక్కడి నుంచి కలకత్తాకు జస్టిస్ సుదీప్ అహ్లువాలియా, ఒరిస్సాకు జస్వంత్ సింగ్, పాట్నాకు రాజన్ గుప్తాలను సూచించారు.
కలకత్తా హైకోర్టు నుంచి ఇద్దరిని బదిలీ చేయాలని సిఫార్సు చేశారు. వారిలో ఒరిస్సా హైకోర్టుకు న్యాయమూర్తులు అరిందం సిన్హా, సౌమెన్ సేన్లను కొలీజియం సూచించింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనూప్ చిట్కారా, సురేశ్వర్ ఠాకూర్‌లను వరుసగా పంజాబ్ మరియు హర్యానా, అలహాబాద్ హైకోర్టులకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది.
రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సబీనా, జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మలను వరుసగా హిమాచల్ ప్రదేశ్, పాట్నా హైకోర్టులకు బదిలీ చేయాలని సిఫార్సు చేశారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేశారు.
గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పరేశ్ ఆర్. ఉపాధ్యాయను మద్రాస్ హైకోర్టుకు సిఫార్సు చేశారు. ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ కుమార్ మిశ్రాను ఉత్తరాఖండ్‌కు సిఫారసు చేశారు. జస్టిస్ T.S. శివజ్ఞానంను మద్రాస్ హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ A.M. బాదర్ మరియు కర్ణాటకకు చెందిన P.B. బజంత్రీ ఇద్దరూ పాట్నా హైకోర్టు జడ్జీలుగా సిఫార్సు చేయబడ్డారు.
మొత్తంగా చూస్తే.. జడ్జీలు.. ప్రస్తుత స్థానం.. బదిలీ స్థానం
1). జస్టిస్ సబీనా - రాజస్థాన్ హైకోర్టు నుంచి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు
2) జస్టిస్ A.M. బాదర్ - కేరళ హైకోర్టు నుంచి పాట్నాహైకోర్టుకు
3) జస్టిస్ వివేక్ అగర్వాల్ - అలహాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు
4) జస్టిస్ దీప్ అహ్లువాలియా - పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టుకు
5) జస్టిస్ రవినాథ్ తిల్హారి - అలహాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు
6) జస్టిస్ చంద్ర ధర సింగ్ - అలహాబాద్ నుంచి ఢిల్లీ
7)జస్టిస్ అనూప్ చిత్కారా - హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్ మరియు హర్యానా
8) జస్టిస్ యశ్వంత్ వర్మ - అలహాబాద్ నుంచి ఢిల్లీ
9) జస్టిస్ టి.ఎస్. శివజ్ఞానం - మద్రాసు నుంచి కలకత్తా
10) జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ - ఛత్తీస్‌గఢ్ నుంచి రాజస్థాన్ కు
11)జస్టిస్ అరిందం సిన్హా - కలకత్తా నుంచి ఒరిస్సాకు
12) జస్టిస్ ఉజ్జల్ భుయాన్ - బొంబాయి టు తెలంగాణ
13)జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్ - హిమాచల్ ప్రదేశ్ నుంచి అలహాబాద్
14) జస్టిస్ జస్వంత్ సింగ్ - పంజాబ్ మరియు హర్యానా నుంచి ఒరిస్సా కు
15) జస్టిస్ సుభాష్ చంద్ (అదనపు న్యాయమూర్తి) - అలహాబాద్ నుంచి జార్ఖండ్ కు
16) జస్టిస్ M.S.S రామచంద్రరావు - తెలంగాణ నుంచి పంజాబ్ మరియు హర్యానా
17) జస్టిస్ M.N. భండారి - అలహాబాద్ నుంచి మద్రాస్
18) జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా - పాట్నా నుంచి ఆంధ్రప్రదేశ్ కు
19) జస్టిస్ సంజయ కుమార్ మిశ్రా - ఒరిస్సా నుంచి ఉత్తరాఖండ్ కు
20) జస్టిస్ సౌమెన్ సేన్ - కలకత్తా నుంచి ఒరిస్సా కు
21) జస్టిస్ పి.బి. బజంత్రీ - కర్ణాటక నుంచిపాట్నా కు
22)జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ - రాజస్థాన్ నుంచి పాట్నా కు
23) జస్టిస్ పరేష్ ఆర్. ఉపాధ్యాయ - గుజరాత్ నుంచి మద్రాస్
24) జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ - తెలంగాణ నుంచి త్రిపురకు
25) జస్టిస్ రాజన్ గుప్తా - పంజాబ్ మరియు హర్యానా నుంచి పాట్నా కు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP High Court, NV Ramana, Supreme Court, Telangana High Court