హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సర్జికల్ స్ట్రైక్‌లో హతమైంది 300 మందే .. ఇదీ లెక్క ?

సర్జికల్ స్ట్రైక్‌లో హతమైంది 300 మందే .. ఇదీ లెక్క ?

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్‌‌పై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపించింది. భారత సైన్యం ధైర్యసాహసాలను అభినందనల్లో ముంచెత్తింది. అయితే, తాజాగా ఈ సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి అధికార విపక్షాల మధ్య కొత్త వివాదం తలెత్తింది.

ఇంకా చదవండి ...

  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్‌‌పై యావత్ దేశం ప్రశంసల వర్షం కురిపించింది. భారత సైన్యం ధైర్యసాహసాలను అభినందనల్లో ముంచెత్తింది. అయితే, తాజాగా ఈ సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి అధికార విపక్షాల మధ్య కొత్త వివాదం తలెత్తింది. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన ఆధారాలు చూపాలని, నిజంగా టెర్రరిస్టులు ఎంతమంది చనిపోయారో చెప్పాలని విపక్షం డిమాండ్ చేస్తోంది.

  నిజానికి సర్జికల్ స్ట్రైక్‌లో ఎంతమంది చనిపోయారనే లెక్క పక్కాగా తెలియకపోయినా.. 3 నుంచి 4 వందల మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక సమాచారం తెలియరాలేదు. అయితే, భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఎంత మంది చనిపోయారనే దానికి ఇప్పుడొక ఆధారం దొరికింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. బాలాకోట్‌లో వాయుసేన దాడులకు ముందు రోజు వరకు అక్కడ 300 సెల్‌ఫోన్ కనెక్షన్లు మనుగడలో ఉండేవి. అయితే, భారత వాయుసేన జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత.. అవి పనిచేయడం లేదు. అక్కడ సిగ్నల్స్ అన్నీ ధ్వంసమైపోయాయి. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి మొబైల్ కనెక్షన్లూ యాక్టివ్ మోడ్ లేవని చెప్పింది.

  అయితే, భారత ప్రభుత్వం గానీ, వాయుసేన గానీ ఇప్పటివరకూ సర్జికల్ స్ట్రైక్‌లో ఇంతమంది చనిపోయారంటూ ఒక స్పష్టమైన ప్రకటనను విడుదల చేయలేదు. దీనిపై విపక్ష కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఎంతమందిని చంపారో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, విడుదలైన ఈ సమాచారం ప్రకారం లెక్క పక్కానా, లేక ఇంకేమైనా తేడాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది.

  First published:

  Tags: Indian Air Force, Pakistan, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు