నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు

Parliament Winter Session : ఇప్పటివరకూ జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి ప్రతిపక్షాలు హనీమూన్ టైమ్ ఇచ్చాయి. ఇప్పుడు గడువు ముగియడంతో... కేంద్రాన్ని నిలదీస్తామంటున్నాయి. కీలక బిల్లులు పాస్ చేయించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

news18-telugu
Updated: November 18, 2019, 5:43 AM IST
నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు
పార్లమెంట్ (File)
  • Share this:
Parliament Winter Session : ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో... మొదటి ఐదేళ్లూ బాగానే సాగినట్లు కనిపిస్తున్నా... రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక... దేశంలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఆర్థిక మాంద్యం, ఆర్థిక మందగమనం, పడిపోతున్న వృద్ధి రేటు, నిరుద్యోగం, జమ్మూకాశ్మీర్‌లో ఇంకా సెట్ కాని పరిస్థితులు, రైతు వ్యతిరేక నిర్ణయాలు ఇలా... చాలా అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ప్రతిపక్షాలు గుర్రుగా ఉన్నాయి. కేంద్రం మాత్రం... కీలక బిల్లుల్ని పాస్ చేయించుకోవడంపైనే దృష్టి సారిస్తోంది. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌కు చెందిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, ముస్లిమేతర భారతీయ సంతతివారికి భారత పౌరసత్వం కల్పించే "పౌరసత్వ సవరణ బిల్లు", అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుతోపాటు మొత్తం 27 బిల్లులను లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... తెలంగాణలో 44 రోజుల నుంచీ కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లేవనెత్తనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్ర నిధుల మంజూరు అంశాలపై వైసీపీ నేతలు గళమెత్తనున్నారు. ఏపీలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ... లోక్‌సభ, రాజ్యసభలోని ఐదుగురు టీడీపీ ఎంపీలు ఆందోళన చేయనున్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ తెలిపినా... ప్రతిపక్షాలకు నమ్మకం కలగట్లేదు. అందువల్ల సభలు సజావుగా జరుగుతాయా అన్నది అనుమానమే.

కీలక పాయింట్లు -

- మోదీ సారధ్యంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక... 17వ లోక్ సభ ఏర్పాటైంది.


- ఇవి 17వ లోక్ సభలో రెండోసారి జరుగుతున్న సమావేశాలు.
- మొత్తం 27 బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టాలనుకుంటోంది.
- మొత్తం 20 రోజులు శీతాకాల సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి.- ఈ నెల 26న ప్రత్యేక రాజ్యాంగ దినోత్సవం కారణంగా లోక్ సభ, రాజ్యసభ సభ్యుల సంయుక్త సమావేశం జరగనుంది.
- ఈ-సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వచేయటాన్ని నిషేధించే సవరణ బిల్లు కూడా ఈసారి సభ ముందుకు రానున్నది.
- ఈసారి ప్రతిపక్షంలో ఉన్న శివసేన... లోక్ సభలోని తన 18 మంది, రాజ్యసభలోని ముగ్గురు ఎంపీలతో... ఆందోళనలు చేయించనుంది.
- రెండు సభల్లో శివసేన ఎంపీలు... ప్రతిపక్షాలు కూర్చునే చోట కూర్చుంటారు.
- అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు NDA వర్గాల్లో కాన్ఫిడెన్స్ నింపిందే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

 

Pics : బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అనన్యా పాండే
ఇవి కూడా చదవండి :

Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్

వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం


Health Tips : తరచుగా అంజీర్ తింటున్నారా... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...

మ్యూజిక్, పాటలు వింటున్నారా... మీ బ్రెయిన్‌కి తిరుగుండదు

 
First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>