హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Omicron : మళ్లీ మూసివేత దిశగా! -pm modi అత్యవసర భేటీ -భయానక ఒమిక్రాన్ భారత్‌‌లోకి వస్తే అంతేనా!!

Omicron : మళ్లీ మూసివేత దిశగా! -pm modi అత్యవసర భేటీ -భయానక ఒమిక్రాన్ భారత్‌‌లోకి వస్తే అంతేనా!!

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

కరోనా సెకండ్ వేవ్ లో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న డెల్టా వైరస్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ‘ఒమిక్రాన్’ వేరియంట్ చాపకింద నీరులా దేశదేశాలకు వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో భారత్ లో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోదీ శనివారం నాడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు..

ఇంకా చదవండి ...

ఇక ముగిసిందనుకున్న ప్రతిసారి కొత్త వేరియంట్ రూపొంలో ముంచేసిన కరోనా మహమ్మారి మరోసారి అత్యంత ప్రమాదకర రూపాన్ని సంతరించుకుంది. సెకండ్ వేవ్ లో లక్షల మంది ప్రాణాలను బలితీసుకున్న డెల్టా వేరియంట్ కంటే ఎన్నో రెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ‘ఒమిక్రాన్’వేరియంట్ (Omicron variant) ఇప్పుడు భూగోళానికి కొత్త ముప్పులా మారింది. ఏకంగా 32 మ్యూటేషన్లు కలిగున్న ‘ఒమిక్రాన్’ వేరియంట్.. రెండు డోసుల టీకా తీసుకున్నవారిని సైతం వదలట్లేదు. దీని పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా సహా పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఇండియా ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న దరిమిలా ఒమిక్రాన్ పై పరిస్థితి డోలాయమానంగా మారింది. మరోవైపు భారత్ లో కొవిడ్ మరణాలు మళ్లీ పెరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం నాడు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. భారత్ లో కొవిడ్ పరిస్థితులపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ప్రధాని కీలక సూచనలు ఇవ్వనున్నారు..

దేశంలో కొవిడ్ పరిస్థితి, కొత్త కేసులు, మరణాలు, కేరళలో వైరస్ విజృంభణ, వ్యాక్సినేషన్ పక్రియ తదితర అంశాలపై ప్రధాని మోదీ ఇవాళ కీలక సమావేశం జరుపుతున్నారు. ఈ భేటీలో ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, నీతి ఆయోగ్ తదితర విభాగాలకు చెందిన కీలక అధికారులు హాజరుకానున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటలకే భారత్ లో కొవిడ్ పై మోదీ కీలక సమావేశం జరుపుతోన్న నేపథ్యంలో దానిపైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అమెరికాకు బుద్ధి చెప్పేలా మోదీ మంత్రాంగం -డిసెంబర్ 6న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక -modi putin summit 2021



భారత్ లో కొవిడ్ మరణాలు మళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించిన లెక్కల ప్రకారం, నిన్న ఒక్కరోజే మహమ్మారికి 465 మంది బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,67,933కు పెరిగింది. దేశంలో కొత్తగా 8,318 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,63,749కి పెరిగింది. నిన్న ఒక్కరోజే దేశంలో 73,58,017 డోసులను పంపిణీ చేశారు. తద్వారా దేశంలో మొత్తం పంపిణీ అయిన డోసుల సంఖ్య 121కోట్లు దాటింది. వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోదీ అధికారులకు కీలక సూచనలు చేస్తారని తెలుస్తోంది.

Tomato prices : కిలో రూ.200 తప్పదు! -షాకింగ్ విషయం చెప్పిన Crisil -టమాటాపై కేంద్రం అప్పులు


సౌతాఫ్రికాలో గుర్తించిన సరికొత్త వేరియంట్ B.1.1.529కు ‘ఒమిక్రాన్’అని పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తొలిసారిగా ఈ వైరస్ వేరియంట్ సౌతాఫ్రికాలో ఓ పేషెంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ లో బయటపడినట్టుగా చెబుతున్నారు. దీని స్పైక్ ప్రొటీన్ లో 32 మ్యుటేషన్లు ఉన్నట్టుగా పరిశోధనల్లో గుర్తించారు సైంటిస్టులు. దీని విషయంలో ప్రపంచదేశాలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. డెల్టా కంటే అత్యంత ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ ఇప్పటికే సౌతాఫ్రికాతోపాటు బోట్సువానా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్, డెన్మార్క్ దేశాలకు వ్యాపించింది. దీంతో పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు విధించాయి. ఈ వేరియంట్ గనుక భారత్ లోకి ప్రవేశిస్తే పెను ప్రమాదం తప్పదనే అంచనాలున్నాయి. ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచం మళ్లీ మూసివేత దిశగా వెళుతోన్న సంకేతాలున్నాయి..

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Coronavirus, Covid, Covid -19 pandemic, Pm modi, WHO

ఉత్తమ కథలు