హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gen Bipin Rawat దుర్మరణం -దేశానికి కొత్త CDS ఎవరు? -దక్షిణాదికి చెందిన అధికారేనా?

Gen Bipin Rawat దుర్మరణం -దేశానికి కొత్త CDS ఎవరు? -దక్షిణాదికి చెందిన అధికారేనా?

దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, వైఎస్ సీడీఎస్ (ఎయిర్ మార్షల్) రాధాకృష్ణ, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే

దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, వైఎస్ సీడీఎస్ (ఎయిర్ మార్షల్) రాధాకృష్ణ, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే

దేశ ప్రతిష్టకు, సాయుధ బలగాలకు నేతృత్వం వహించేది కావడంతో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచే వీలుండదు. విషాదకర సమయాల్లోనూ బలగాలు విధి నిర్వహణలో రాజీపడరాదనే సూత్రాన్ని అనుసరిస్తూ జనరల్ బిపిన్ రావత్ వారసుడి ఎంపికపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి..

ఇంకా చదవండి ...

భారత సాయుధ త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. బుధవారం నాడు ఆయన ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు సమీపంలో కుప్పకూలడంతో సీడీఎస్, ఆయన భార్య మధులికా, ఆర్మీ ఉన్నతాధికారులు సహా 13 మంది మరణించారు. హెలికాప్టర్ లో ప్రయాణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. దేశ ప్రతిష్టకు, సాయుధ బలగాలకు నేతృత్వం వహించేది కావడంతో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచే వీలుండదు. విషాదకర సమయాల్లోనూ బలగాలు విధి నిర్వహణలో రాజీపడరాదనే సూత్రాన్ని అనుసరిస్తూ జనరల్ బిపిన్ రావత్ వారసుడి ఎంపికపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.

కొత్త సీడీఎస్‌పై కేబినెట్ లో చర్చ?

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మణంతో యావత్ దేశం విషాదంలో కూరుకుపోయింది. ఆయన అసలు సిసలు దేశభక్తుడని, సాయుధ బలగాల ఆధునీకరణ కోసం విశేష కృషి చేశారని ప్రధాని మోదీ శ్లాఘించారు. కాగా, రావత్ మరణాన్ని ధృవీకరించుకున్న తర్వాత ఢిల్లీలో అత్యవసరంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు అందుబాటులో ఉన్న మంత్రులతో మోదీ సమాలోచనలు జరిపారు. ఆ భేటీలోనే తదుపరి సీడీసీగా ఎవరుండాలనే అంశంపైనా చర్చ జరిగినట్లు, పలువురి పేర్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పలువురి పేర్లను మంత్రి వర్గం పరిశీలించినట్లు సమాచారం.

CDS దుర్మరణంపై PM modi భావోద్వేగం -Gen Bipin Rawat గురించి ఆ మాటలు చదివితే..ప్రస్తుత వైఎస్ సీడీఎస్ బీఆర్ కృష్ణకే?

ప్రపంచంలోని అగ్ర దేశాల మాదిరిగానే భారత్ లోనూ త్రివిధ దళాలకు అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఉండాలనే ప్రతిపాదన దశాబ్దాల కిందటే చేసినప్పటికీ, మోదీ మార్కు పాలనకు నిదర్శనంగా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంచిన సీడీఎస్ పదవిని సృష్టించే పనిని 2019లోనే చేపట్టడం తెలిసిందే. ఆ విధంగా ఆర్మీ చీఫ్ నుంచి భారత్ కు తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ నియమితులయ్యారు. త్రివిధ దళాలకు సంబంధించి సీడీఎస్ అత్యున్నత పదవికాగా, రెండో అత్యున్నత పోస్టుగా వైస్ సీడీఎస్ ను సైతం సృష్టించడం తెలిసిందే. తొలి వైస్ సీడీఎస్ గా వ్యవహరించిన వైస్ అడ్మిరల్ హరి కుమార్ ఈ వారంలోనే నేవీ చీఫ్ గా నియమితులయ్యారు. రెండో వైఎస్ సీడీఎస్ గా పనిచేసిన వైఎస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ రిటైర్మెంట్ పొందారు. ప్రస్తుతం వైఎస్ సీడీఎస్ గా ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాక‌ృష్ణ(బీఆర్ కృష్ణ) కొనసాగుతున్నారు.

Helicopter Crash : ఎన్నో దుర్ఘటనలు.. హెలికాప్టర్, విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరంటే


ఆర్మీ చీఫ్ నరవణేను ఎంచుకుంటారా?

సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో వైఎస్ సీడీఎస్ బలభద్ర రాధాకృష్ణనే అత్యున్నత పదవిలో ఉన్నట్లయింది. కాగా, వైఎస్ సీడీఎస్ బీఆర్ కృష్ణనే సీడీఎస్ గా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రావత్ ఉత్తరాదికి చెందినవారు కాగా, రాధాకృష్ణ దక్షిణాదికి చెందినవారు. ఏ అకాడమీకైతే ఇవాళ రావత్ వెళుతూ దుర్మరణం చెందారో ఆ వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీ నుంచే బీఆర్ కృష్ణ ఎదిగి వచ్చారు. అయితే సీడీఎస్ గా ఎవరిని నియమించాలనేది కేంద్రం ప్రాధాన్యంతలను బట్టి ఉంటుందని తెలిసిందే. వైస్ సీడీసీ బీఆర్ కృష్ణతోపాటు ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే పేరును సైతం సీడీఎస్ పోస్టుకు కేంద్రం పరిశీలించినట్లు వినికిడి. అదీగాక ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసిన అధికారుల కంటే ఆర్మీలో పనిచేసిన వారినే సీడీఎస్ పదవి వరించడం చాలా దేశాల్లో జరుగతుంది. భారత కొత్త సీడీఎస్ ఎవనేదానిపై ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు, వ్యాఖ్యలు వెలువడలేదు. అత్యంత కీలకమైన ఈ నియామకాలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. అప్పటిదాకా కొత్త సీడీఎస్ ఎవరనేది సస్పెన్సే.

Published by:Madhu Kota
First published:

Tags: Bipin Rawat, Indian Air Force, Indian Army, Indian Navy

ఉత్తమ కథలు