పౌరసత్వ బిల్లుపై ప్రజ్వరిల్లిన హింస... నేడు 8 రైళ్లు రద్దు...

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస ప్రజ్వరిల్లింది. దీంతో సోమవారానికి సంబంధించి 8 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

news18-telugu
Updated: December 16, 2019, 5:09 AM IST
పౌరసత్వ బిల్లుపై ప్రజ్వరిల్లిన హింస... నేడు 8 రైళ్లు రద్దు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస ప్రజ్వరిల్లింది. దీంతో సోమవారానికి సంబంధించి 8 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరో రెండు రైళ్ల గమ్యస్థానాన్ని కుదించింది. క్యాబ్‌ను వ్యతిరేకిస్తూ గత ఐదు రోజులుగా పశ్చిమ బెంగాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవి రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది.

నేడు రద్దయిన రైళ్ల వివరాలు...

1. 53051/53052 అజింగంజ్ - నింటీటా - అజింగంజ్ పాసింజర్
2. 53053/53054 కత్వా - నింటీటా - కత్వా పాసింజర్
3. 73151/73152 షెల్దా - జాంజిపూర్ రోడ్ - షెల్దా DEMU
4. 53021/53022 అజింగంజ్ - షాహిబ్‌గంజ్ - అజింగంజ్ పాసింజర్
5. 53037/53038 షాహిబ్‌గంజ్ - భాగల్‌పూర్ - షాహిబ్‌గంజ్ పాసింజర్6. 53035/53036 అజింగంజ్ - బర్హార్వా - అజింగంజ్ పాసింజర్
7. 53027/53028 అజింగంజ్ - మాల్దా టౌన్ - అజింగంజ్ పాసింజర్
8. 53433/53434 అజింగంజ్ - బర్హార్వా - అజింగంజ్ పాసింజర్

గమ్యస్థానాన్ని కుదించిన రైళ్ల వివరాలు...

1. 53030 భాగల్‌పూర్ - అజింగంజ్ పాసింజర్ బర్హార్వా వరకు మాత్రమే వెళ్తుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో షాహిబ్‌గంజ్ వరకు వెళ్తుంది.

2. 53029 షాహిబ్‌గంజ్ వరకు మాత్రమే వెళ్తుంది

మరోవైపు పశ్చిమ బెంగాల్లో హింసకు సంబంధించి ఫేక్ న్యూస్ ప్రసారం చేసే అవకాశం ఉన్నందున మాల్దా, ఉత్తర దినాజ్‌పూర్, ముర్షిదాబాద్, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 16, 2019, 5:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading