ఇవాళ కేజ్రీవాల్ నామినేషన్... ఢిల్లీ అప్‌డేట్స్ ఏంటి?

Delhi : ఎన్నికలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతున్నా అదో కిక్కే. అధికార పార్టీ గెలుస్తుందా? ప్రతిపక్షం గద్దెనెక్కుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ఢిల్లీలో ఆప్ సర్కార్ పరిస్థితేంటో, ఎలా ఉందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 20, 2020, 6:03 AM IST
ఇవాళ కేజ్రీవాల్ నామినేషన్... ఢిల్లీ అప్‌డేట్స్ ఏంటి?
అరవింద్ కేజ్రీవాల్
  • Share this:
Delhi : ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన కొత్తలో... దాని కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్... పెద్దగా ప్రచారాల జోలికి వెళ్లేవారు కాదు. ఎందుకొచ్చిన ఖర్చులే అనుకునేవారు. కానీ... కాలం మారుతున్న కొద్దీ, ఇతర పార్టీలు ప్రచారాలతో దుమ్మెత్తిపోస్తున్న కొద్దీ... ఆయన కూడా రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ప్రతిపక్షాల్ని దెబ్బ కొట్టాలంటే... వాళ్ల రూట్‌లోనే వెళ్లాలని డిసైడయ్యారు. అలాంటి దూకుడు నిర్ణయాలతోనే ఆయన ఐదేళ్ల కిందట ఢిల్లీ సీఎం అవ్వగలిగారు. ఇప్పుడు మరోసారి ఆ పీఠాన్ని అధిరోహించేందుకు ఇవాళ న్యూఢిల్లీ నియోజకవర్గానికి నామినేషన్ వెయ్యబోతున్నారు. ఐతే... అలా సొంత కారులో వెళ్లి... ఇలా నామినేషన్ వేసి వచ్చేసేయరు. దీనికి పెద్ద ప్లానే వేశారు. ముందుగా కేజ్రీవాల్ భారీ రోడ్ షో నిర్వహించబోతున్నారు. అంతకంటే ముందు చారిత్రక వాల్మీకీ మందిరంలో... వాల్మీకీ భగవానుడి ఆశీర్వాదం కూడా తీసుకోబోతున్నారు. ఇలా సెంటిమెంట్‌ని సెట్ చేసుకొని... నామినేషన్ వెయ్యాలనుకోవడం... ఎన్నికల ప్రచార ఎత్తుగడలో భాగమే. తన రోడ్ షోలో పాల్గొనాల్సిందిగా ఆయన ప్రజలను ట్వీట్ ద్వారా కోరారు.


కన్నాట్‌ప్లేస్ నుంచీ... పంచుకుయన్ మార్గ్ గుండా... ఇన్నర్ సర్కిల్ లోకి వెళ్లి... ఆ తర్వాత... ఔటర్ సర్కిల్ గుండా... బాబా ఖారక్ సింగ్ మార్గ్ వరకూ ఈ రోడ్ షో సాగుతూ... చివరకు పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర ముగుస్తుంది. తర్వాత జామ్‌నగర్ హౌస్‌లోని SDM ఆఫీస్‌లో కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఇంతకంటే ముందే... ఆదివారం కేజ్రీవాల్... 10 ప్రామిస్‌లతో... ఓ గ్యారెంటీ కార్డు రిలీజ్ చేశారు. అందులో విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం, మహిళల రక్షణకు మొహల్లా మార్షల్స్ మోహరింపు హామీలు కూడా ఉన్నాయి. అలాగే... 200 యూనిట్ల వరకూ ఉచిత ఎలక్ట్రిసిటీ, ఉచిత ఆరోగ్య సదుపాయాలు, రెండు కోట్ల మొక్కలు నాటడం, యమునానదిని శుభ్రం చెయ్యడం, పొల్యూషన్ తగ్గించడం (వచ్చే ఐదేళ్లలో) వంటి హామీలు ఆ లిస్టులో ఉన్నాయి.ఫిబ్రవరి 8న 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మిగతా విషయాలు మీకు తెలిసినవే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్... 67 సీట్లు గెలిచింది, బీజేపీ 3 గెలిచింది. ఈ ఎన్నికల్లో మళ్లీ ఆప్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తన సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని పెంచుకోవాలనుకుంటోంది. కాంగ్రెస్ మాత్రం కోలుకోలేక కిందా మీదా పడుతోంది. Video : నేషనల్ ఒలింపిక్స్‌కి రెడీ అవుతున్న స్కై టీమ్

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు