ఢిల్లీలో చైనా కంపెనీకి సీసీటీవీ ప్రాజెక్టు...బీజేపీ నేత సంచలన ఆరోపణలు...

అమెరికా, యూకే దేశాల్లో బ్యాన్ ముద్ర వేయబడి, వివాదాస్పదమైన హిక్‌విజన్ కంపెనీకి సీసీటీవీ ప్రాజెక్టు అప్పజెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై ఢిల్లీ బీజేపీ నేత హరీష్ ఖురానా పలు ప్రశ్నలు లేవనెత్తారు.

news18-telugu
Updated: June 29, 2019, 8:51 PM IST
ఢిల్లీలో చైనా కంపెనీకి సీసీటీవీ ప్రాజెక్టు...బీజేపీ నేత సంచలన ఆరోపణలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. అమెరికా, యూకే దేశాల్లో బ్యాన్ ముద్ర వేయబడి, వివాదాస్పదమైన హిక్‌విజన్ కంపెనీకి సీసీటీవీ ప్రాజెక్టు అప్పజెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై ఢిల్లీ బీజేపీ నేత హరీష్ ఖురానా పలు ప్రశ్నలు లేవనెత్తారు. కేజ్రీవాల్ తన పదవీ కాలం పూర్తయ్యే ముందే సీసీ కెమెరాలు పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా యూకే, యూఎస్ఎ లాంటి దేశాల్లో బ్యాన్ ఎదుర్కొంటున్న చైనా కంపెనీ హిక్ విజన్ కు సీసీ కెమెరాల ప్రాజెక్టు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు అలాగే దేశ భ్రదత విషయంలో కేజ్రీవాల్ నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే తాము నిబంధనలకు అనుగుణంగానే భారత్ ఎలాక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకు సీసీ కెమెరాల ప్రాజెక్టు ఇచ్చామని బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆప్ నే సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

First published: June 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>