గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోయినా.. ఆప్‌కు మాత్రం ఢిల్లీ MCD ఎన్నికలు పెద్ద ఊరట కలిగించబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 2022 ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. దాదాపు 15 ఏళ్లుగా స్థానిక సంస్థలు బీజేపీ చేతిలో ఉండగా.. ఇప్పుడు అక్కడ ఆప్ పాగా వేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. MCD ఎన్నికల 2022 పోలింగ్ డిసెంబర్ 4, ఆదివారం, 250 వార్డులకు జరిగింది. MCD ఎన్నికల 2022 ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. MCD ఎన్నికల 2022 కోసం ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. ఢిల్లీలో MCD ఎన్నికల్లో AAP 149-171 సీట్లు గెలుస్తుందని అంచనా వేశారు. మరోవైపు బీజేపీకి 69-91 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ కేవలం మూడు నుండి ఏడు సీట్లతో చాలా వెనుకబడి ఉంటుందని అంచనా వేయబడింది.
టైమ్స్ నౌ ప్రకారం ఈ ఎన్నికల్లో AAP 146 నుంచి 156 వార్డుల్లో గెలవొచ్చు. బీజేపీ 84-94 వార్డులను గెలుచుకునే అవకాశం ఉంది. జన్ కీ బాత్-ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. MCD ఎన్నికల్లో AAP ఈసారి స్వీప్ చేయనుంది. ఆప్ 150-175 సీట్లు కైవసం చేసుకోవచ్చని, బీజేపీ 92-70 వార్డులను గెలుచుకోవచ్చని పేర్కొంది. కాంగ్రెస్ మళ్లీ 7-4 సీట్లు గెలుచుకోవడంలో విఫలం కావచ్చు.
ఆదివారం జరిగిన MCD ఎన్నికల 2022లో సాయంత్రం 5.30 గంటల వరకు దాదాపు 50.47 శాతం ఓటింగ్ నమోదైంది. కొన్ని పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 5.30 గంటల తర్వాత కూడా పోలింగ్ కొనసాగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది.
Gujarat Exit Polls 2022: బీజేపీదే గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్‌లో పోటాపోటీ.. కనిపించని ఆప్ ప్రభావం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పెద్దగా అవాంతరాలు లేవని, 25,000 మందికి పైగా పోలీసులు, దాదాపు 13,000 మంది హోంగార్డులు, 100 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించిన 493 ప్రాంతాల్లోని 3,360 క్రిటికల్ బూత్‌ల వద్ద అత్యంత భద్రతతో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arvind Kejriwal, Delhi