కేంద్రానికి కేజ్రీవాల్ షాక్... కేజ్రీవాల్‌కి ఢిల్లీ పోలీసుల షాక్...

Kejriwal vs Delhi Police : సీఎం హోదాలో ఉండే వ్యక్తి విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అడ్డంగా బుక్కైపోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా అదే జరిగింది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 10:05 AM IST
కేంద్రానికి కేజ్రీవాల్ షాక్... కేజ్రీవాల్‌కి ఢిల్లీ పోలీసుల షాక్...
ఢిల్లీ పోలీసులు (File)
  • Share this:
ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నా... తనకు సర్వాధికారాలూ లేవనే బాధ కేజ్రీవాల్‌ను వెంటాడుతోంది. ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రం చెయ్యాలనే డిమాండ్‌తో కేజ్రీవాల్ అప్పుడప్పుడూ కేంద్రంపై విరుచుకుపడుతూనే ఉంటారు. తాజాగా మరోసారి అలాంటి సందర్భం వచ్చింది. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదన్న కేజ్రీవాల్‌... 24 గంటల్లోనే ఢిల్లీలో ఐదు హత్యలు జరిగాయనీ, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ట్వీట్ చేశారు. ఐదు హత్యలు జరగడం సాదాసీదా విషయం కాదన్న ఆయన... పరిస్థితి బాలేదనడానికి ఇంతకంటే ఏం కావాలంటూ... ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు... ఆ ట్వీట్‌ను కేంద్ర హోంశాఖ, లెఫ్టినెంట్ గవర్నర్‌లకు ట్యాగ్ చేశారు. హోంశాఖ, లెఫ్టినెంట్ గవర్నర్ కళ్లు తెరవాలని విమర్శించారు.

రాజకీయ ప్రయోజనాలతో చేసిన ఈ ట్వీట్‌... ఢిల్లీ పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఐదు హత్యలు జరగడం నిజమేనని ఒప్పుకున్న పోలీసులు... అవి లా అండ్ ఆర్డర్ సమస్యకు సంబంధించినవి కావనీ, వ్యక్తిగత కక్షలతో జరిగినవనీ తెలిపారు. ఆ కేసుల్లో దర్యాప్తు జరుగుతోందనీ, కొందర్ని పట్టుకున్నామనీ వివరించారు. ఇలా పూర్తి వివరాలతో కేజ్రీవాల్ ట్వీట్‌కి కౌంటర్‌ ఇచ్చారు.


ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందన్న ఢిల్లీ పోలీసులు... లాస్ట్ ఇయర్‌తో పోల్చితే 10.5 శాతం తగ్గిందన్నారు. ఆయుధాలతో జరిగే హత్యల రేటు 5.65 శాతం, మహిళలపై నేరాలు 11.5 శాతం తగ్గాయని వివరించారు. మొత్తానికి కేజ్రీవాల్ కేంద్రానికి షాక్ ఇవ్వాలని చూస్తే... ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌కి షాక్ ఇచ్చినట్లైంది.

 

ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాట్ల కంపెనీపై సచిన్ కేసు.. 2 మిలియన్ డాలర్ల దావా...

40వేల ఏళ్ల నాటి తోడేలు తల... ఇప్పటికీ అలాగే ఉంది... సైబీరియా మంచులో...

డబ్బుల్లేని ATMపై ఫైన్... ఆర్బీఐ కొత్త నిర్ణయం

టీడీపీలో మొదలైన సెగలు... చంద్రబాబుపై తమ్ముళ్ల మాటల మంటలు...
First published: June 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు