అరుణాచల్‌లో ఎమ్మెల్యే దారుణ హత్య...మిలిటెంట్ల చేతిలో మొత్తం 11మంది హతం...

అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే తిరోంగ్ అబో (Image : Facebook)

అరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన తిరోంగ్ అబో తో పాటు, ఆయన కుమారుడు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మందిని మిలిటెంట్లు తుపాకులతో దాడి చేసి అంతమొందించారు.

  • Share this:
    అరుణాచల్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రానికి చెందిన దక్షిణ కోన్సా అసెంబ్లీ సభ్యుడు తిరోంగ్ అబోను నిషేధిత మిలిటెంట్ గ్రూపు దాడి చేసి మట్టుబెట్టింది. వివరాల్లోకి వెళితే  అరుణా చల్ ప్రదేశ్‌లోని నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన తిరోంగ్ అబో తో పాటు, ఆయన కుమారుడు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మందిని మిలిటెంట్లు తుపాకులతో దాడి చేసి అంతమొందించారు. అయితే దాడి తాము చేసామని ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఈ దాడిని నాగా మిలిటెంట్లు చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే జరిగిన ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    ఇదిలా ఉంటే ఎన్‌పీపీ అధ్యక్షుడు మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ కె. సంగ్మా సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అలాగే అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు.
    First published: